చాలా మంది రాత్రిపూట గురక పెడుతూ ఉంటారు. గురక వలన పక్క వాళ్ళ నిద్ర కూడా పాడవుతుంది. గురక వలన చికాకు పెడుతూ ఉంటుంది నిద్రలో గురక చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. 30 ఏళ్ల లోపు వారిలో సుమారు 10% మంది 60 ఏళ్ళు దాటిన వారిలో 60% మంది గురక పెడుతున్నారని స్టడీ చెప్తోంది. ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు ప్రతి నలుగురు స్త్రీలలో ఒకరు రాత్రి గురక పెడుతూ వుంటారు. అయితే ఈ గురకనేది నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడం వదలడం జరిగేటప్పుడు మెడ తల లోని మృదు కణజాలంలో కంపనల వలన ఈ గురక అనేది కలుగుతుంది.
ఈ సెన్సిటివ్ కణజాలం ముక్కు రంద్రాల టాన్సిల్స్ నోటిపై భాగంలో ఉంటాయి. నిద్రపోయేటప్పుడు వాయువు మార్గం రిలాక్స్ స్టేట్ లో ఉంటాయి. ఆ టైంలో గాలి బాగా బలవంతంగా లోపలికి వస్తుంది. అందుకే మృదు కణజాలంలో కంపనలు ఏర్పడతాయి గురకని చాలా మంది చిన్న సమస్యగా భావిస్తారు కానీ రకరకాల అనారోగ్య సమస్యల్ని అది సూచిస్తోందని నిపుణులు అంటున్నారు.
నోటి అనాటమీ తక్కువగా ఉండటం వలన గురక వస్తుంది. మందపాటి మృదువైన అంగిలి ఉంటే వాయు మార్గం తగ్గుతుంది. అధిక బరువు ఉండడం వలన కూడా గురక ఎక్కువ వస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం వలన కూడా గురకవస్తుంది. నాసిక సమస్యలు ఉంటే కూడా గురక వస్తుంది. నిద్రలేమి, స్లీపింగ్ పొజిషన్, అధిక బరువు, ఇరుకైన వాయు మార్గం, మెదడులో సమస్య వలన కూడా గురక వస్తుంది. కనుక గురక ఎక్కువ వస్తుంటే అందుకు కారణాలని కూడా తెలుసుకోవడం మంచిది.