పిల్లల విషయంలో చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పులు ఇవే..!

-

పిల్లల విషయంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని సరిగ్గా పెంచితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది. పైగా చాలామంది పిల్లలు చెప్పిన మాటలు వినరు అలానే మొండి చేస్తూ ఉంటారు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని రాజాలా పెంచాలని భావించి అడిగినవన్నీ కొని ఇచ్చేస్తూ ఉంటారు. ఆస్తుల్ని సంపాదించి పెట్టి భవిష్యత్తులో ఏ కష్టం తెలియకుండా పెంచుతూ ఉంటారు.

అది నిజంగా పొరపాటే ఇలా చేయడం వలన వాళ్లకి కష్టం అంటే ఏమిటో కూడా తెలియదు. అలానే బాధ్యత కూడా రాదు కాబట్టి మీరే వాళ్ళ జీవితాన్ని నడిపించకండి. వాళ్లు సరిగ్గా నడిచేటట్టు వెనుక ఉండి చూసుకుంటే సరిపోతుంది. అలానే ఇది వరకు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్లు బంధాలని బాధ్యతలని పంచుకునే వాళ్ళు కానీ ఈ రోజుల్లో అలా లేదు.

నిజానికి కుటుంబ సభ్యులతో ఉండే ప్రేమ ఆప్యాయత పిల్లల్ని భద్రంగా స్వేచ్ఛగా పెరిగేటట్టు చేసేది. అయితే ఈ రోజుల్లో అలాంటి పెంపకం లేదు దీనితో పిల్లలు ఒంటరితనంతో బాధపడుతున్నారు తాతయ్య నానమ్మ వాళ్లతో కలిసి పిల్లల్ని ఉంచితే వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. పైగా ఒంటరితనం ఉండదు. వాళ్ళ అనుభవం పిల్లల పెంపకంలో సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తుంది. ఒకవేళ కనుక పెద్దలు వారికి దగ్గరలో ఉండకపోతే ఫోన్లని టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు.

వీడియో కాల్ ద్వారా మాట్లాడించొచ్చు. అమ్మలా నాన్నలా చూసుకునే బంధువులు కూడా పిల్లలకి ఉండాలి. అలానే పిల్లలు సెక్యూర్ గా ఫీల్ అవ్వాలి. స్పెషల్ టాలెంట్ ఉంటే సరిపోదు ఈ మధ్యకాలంలో స్పెషల్ టాలెంట్ ఉంటే చాలని అనుకుంటున్నారు కానీ సెక్యూర్ గా ఫీల్ అవ్వడం చాలా ముఖ్యం కాబట్టి తల్లిదండ్రులు ఈ తప్పును కూడా చేయకూడదు. బాల్యమే వ్యక్తిత్వానికి పునాది అని గుర్తు పెట్టుకోండి.

వాళ్లకి క్రమశిక్షణ కూడా అలవాటు చేయాలి అలానే చాలా మంది తల్లిదండ్రులు ఈ మధ్య ఆ పిల్లలకి ఫోన్ లని అలవాటు చేస్తున్నారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏం చెబుతోంది అంటే స్క్రీన్ లకి అలవాటు పడ్డ పిల్లల సామర్థ్యం దెబ్బతింటుంది అని.. వాళ్ళు చదువుకోడానికి కూడా కష్టపడుతూ ఉంటారు టీవీ ఫోన్లు వలన వాళ్ళ మాట తీరు పోతుంది. సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి తప్పుల్ని అస్సలు తల్లిదండ్రులు చేయకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news