ప్రపంచంలోనే అందమైన ప్రదేశాలివే..!

Join Our Community
follow manalokam on social media

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు, ప్రాంతాలు ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన కట్టడాలను చూడటానికి మనదేశ ప్రజలే కాకుండా ప్రపంచదేశాల ప్రజలు అంతే ఆతురత ప్రదర్శిస్తారు. చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుత నిర్మాణాలను చూడటానికి ఎంతో తహతహలాడుతుంటారు. ఇలా ఎందరో ప్లాన్ వేసుకుని ప్రపంచాన్ని చుట్టి వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాలు, కట్టడాల గురించి తెలుసుకుందాం.

తాజ్ మహల్-ఈఫిల్ టవర్
తాజ్ మహల్-ఈఫిల్ టవర్

తాజ్‌మహల్ (భారత్)..
తాజ్‌మహల్ అనేది ఒక అద్భుతమైన సమాధి. భారతదేశంలోనే అత్యంత సుందరమైన కట్టడమిది. క్రీ.పూ. 1631-48లో షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం ఈ కట్టడాన్ని నిర్మించాడు. ఇది పర్షియా, భారతీయ ఇస్లాం శైలితో నిర్మించబడింది. తెల్లటి పాలరాయితో దీన్ని నిర్మించారు. కాగా, 1983లో దీనిని యునెస్కో వారసత్వ సంపదగా పరిగణించింది.

ఈఫిల్ టవర్ (ప్రాన్స్)..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పెద్దదైన ఈఫిల్ టవర్ ఫ్రాన్స్‌లో ఉంది. ఇది సీన్ నది పక్కన ఉన్న చాంప్ డీ మార్స్‌పై నిర్మించిన ఇనుప గోపురం. దీనిని 1889లో గుస్టావ్ ఈఫిల్ నిర్మించాడు. అతడి పేరు మీదే దీనికి నామకరణం చేశారు. ఈ టవర్ బరువు 10 వేల టన్నులు ఉండగా.. ఎత్తు 1,063 అడుగులు ఉంటుంది.

బుర్జ్ ఖలీఫా (దుబాయ్)..
బుర్జ్ ఖలీఫా దుబాయ్‌లో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా పేరుగాంచింది. దీని ఎత్తు 2,716 అడుగులు ఉంటుంది. బుర్జ్ ఖలీఫాను 2004లో ప్రారంభించగా.. 2010లో అందుబాటులోకి వచ్చింది. ఈ భవనానికి మొదటగా ‘బుర్జ్ దుబాయ్’ అని పేరు పెట్టారు. కానీ, అబుదాబి పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గౌరవార్థం పేరును మార్చారు.

రియో డి జనిరో (బ్రెజిల్)..
రియో డి జనిరో బ్రెజిల్ దేశ రాజధాని. ఈ నగరం బ్రెజిల్‌లోనే రెండవ అత్యధిక జనాభా కలిగి ఉంది. 2012లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

లిటిల్ ఇండియా (సింగపూర్)..
సింగపూర్‌లో ఉన్న ‘లిటిల్ ఇండియా’ ఒక అందమైన కట్టడం. 1900 సంవత్సరంలో టాన్ తెంగ్ నియా తన భార్య కోసం ఈ భవనాన్ని నిర్మించాడు. ఇది ఒక ఎనిమిది గదుల విల్లా. ప్రస్తుతం అత్యంత ప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశంగా కొనసాగుతోంది.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...