ఈ వారం థియేటర్/ ఓటీటీలో విడుదల అయ్యే సినిమాలు ఇవే

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లో తెరుచుకున్నాయి. మరోవైపు కొత్త వెబ్ సిరీస్ లు ఓటీటీలలో తళుక్కున మెరుస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన అఖండ అలాగే… పుష్ప సినిమాలతో చిత్రపరిశ్రమలో.. మంచి ఊపు వచ్చింది. దీంతో నిర్మాతలు సినిమాలను విడుదల చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ వారం థియేటర్లలో అలాగే ఓటిటీలలో చాలా సినిమాలు విడుదల కానున్నాయి. అసలు ఈ వారం ఏ సినిమాలు విడుదల కానున్నాయి ఇప్పుడు చూద్దాం.

డిసెంబర్ 24వ తేదీన నేచురల్ స్టార్ నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” థియేటర్లలో విడుదల కానుంది. అలాగే డిసెంబర్ 25వ తేదీన కమెడియన్ సప్తగిరి నటించిన గూడుపుఠాని థియేటర్లలో విడుదల కానుంది. డిసెంబర్ 25వ తేదీన నటి పూర్ణ నటించిన బ్యాక్ డోర్ సినిమా కూడా థియేటర్లలోనే విడుదల కానుంది.

డిసెంబర్ 25వ తేదీన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఆశ ఎన్కౌంటర్ థియేటర్లలో విడుదల కానుంది.  డిసెంబర్ 24వ తేదీన సోనీ లివ్ ఓటిటి లో WWE ఈ సినిమా విడుదల కానుంది. డిసెంబర్ 24వ తేదీన నాగశౌర్య నటించిన వరుడు కావలెను జీ 5 ఓటిటిలో విడుదల కానుంది.