క్రోమ్‌ ఓఎస్‌ కొత్త ఫీచర్లు ఇవే!

-

గూగుల్‌ క్రోమ్‌ ఓఎస్‌ మనందరికి పరిచయమై పదేళ్లు గడిచింది. ఈ నేపథ్యంలో గూగుల్‌ కొన్ని సరికొత్త ఫీచర్లను గూగుల్‌ యూజర్లకు పరిచయం చేస్తోంది. అవి..

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ని క్రోమ్‌బుక్‌ని కనెక్ట్‌ చేసుకునేలా ‘ఫోన్‌హబ్‌’ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల ఫోన్‌ని బుక్‌తోనే ఈజీగా నియంత్రించవచ్చు. మీకు ఫోన్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే ఫోన్‌ నెట్‌వర్క్, సిగ్నల్, బ్యాటరీ రేంజ్‌ కనిపిస్తుంది. అంతేకాదు ఫోన్‌ని మీరు పోగొట్టుకుంటే లొకేట్‌ ఫోన్‌ ఆప్షన్‌తో ఫోన్‌ ఎక్కడన్నుది ఇట్టే తెలిసిపోతుంది. ఫోన్‌ కి వచ్చే మెసేజ్‌లకు కూడా ఫోన్‌ బుక్‌ నుంచే స్పందించవచ్చు.

బుక్‌లో ట్యుటోరియల్‌ కావాలంటే ఎలాంటి స్క్రీన్‌ రికార్డింగ్‌ టూల్స్‌తో పనిలేకుండా స్క్రీన్‌ క్యాప్చర్‌ ఆప్షన్‌తో ఈ వెసలుబాటు ఉంది. స్క్రీన్‌ షాట్‌లతోపాటు స్క్రీన్‌ రికార్డింగ్‌ కూడా చేయవచ్చు.


వైఫై సింక్‌

ఏదైనా వైఫై నెట్‌వర్క్‌ కనెక్ట్‌ అవ్వాలంటే మాన్యువల్‌గా పాస్‌వర్డ్‌లు ఎంటర్‌ చేయాలి. క్రోమ్‌బుక్‌లో ఈ అవసరం ఉండదు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వైఫై నెట్‌వర్క్‌ని కనెక్ట్‌ అయి ఉంటే క్రోమ్‌బుక్‌ నెట్‌వర్క్‌ పరిధిలోకి రాగానే ఆటోమెటిక్‌గా నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అవుతుంది. దీన్నే వైఫై సింక్‌ ఆప్షన్‌గా పరిచయం చేశారు.

గూగులో ఓఎస్‌ మరో సరికొత్త ఫీచర్‌ ఎంటంటే సాధారణంగా మనకు ఏదైనా పదానికి అర్థం తెలియాలంటే సింపుల్‌గా ఆ పదాన్ని సెలెక్ట్‌ చేసి రైట్‌ క్లిక్‌ చేస్తే పదానికి అర్థం తెలుస్తుంది. దాన్ని కాపీ చేసి సెర్చ్‌ చేయాల్సిన పని ఉండదు. క్విక్‌ సెట్టింగ్స్‌ ద్వారా మీడియా కంట్రోల్స్‌ని యాక్సెస్‌ చేయవచ్చు. క్రోమ్‌ స్క్రీన్‌ షాట్‌లు డౌన్‌లోడెడ్‌ ఫైల్స్‌ అన్ని కూడా క్లిప్‌బోర్డులో కనిపిస్తాయి అలాగే క్రోమ్‌ బుక్‌ ద్వారా ఫోటోలను, ఫైళ్లను సులభంగా షేర్‌ చేసుకోవచ్చు.

గూగుల్‌ క్రోమ్‌ ఓఎస్‌లోని గ్రాఫిక్‌ ఇంటర్‌ ఫేస్‌ని మెరుగ్గా ఐకాన్ల రీడిజైన్‌ చేశారు. పలు రకాల యాప్‌లకు కూడా కొత్తగా తీర్చిదిద్దారు.

Read more RELATED
Recommended to you

Latest news