ఇంటి ఉద్యానవనం.. ఇంట్లో పెంచుకోవడానికి అనుకూలంగా ఉండే మొక్కలు ఇవే..

-

కరోనా వచ్చాక ప్రతీ ఒక్కరికీ ఆహారంపై శ్రద్ధ పెరిగింది. రోగ నిరోధకశక్తి పెరగాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని అందరూ గుర్తించారు. అందుకే శుభ్రమైన ఆహారాన్ని వండుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పై కారణాల వల్ల ఇంటి ఉద్యానవనం మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అప్పట్లో ఇంటి వెనకాల పెరట్లో చిన్న చిన్న మొక్కలు పెట్టి, వాటికి కాసిన కూరగాయలని వండుకుని తినేవాళ్ళు. ప్రస్తుతం పెరళ్ళు తగ్గిపోయాయి. నాలుగు డబ్బాల ఇంటిలో ఇంటి కార్ పార్క్ చేసుకోవడానికి ఉంచుకున్న ఖాళీ స్థలమే మిగిలి ఉంది.

ఐతే అలాంటి స్థలంలో కూడా కూరగాయలు పండించవచ్చనే విషయం చాలామందికి తెలియదు. ఏమేం కూరగాయలు పండించవచ్చో తెలుసుకోండి.

గ్రీన్ బీన్స్

బీన్స్.. ఇంట్లో కొద్దిగా ఎక్కువ స్థలం ఉంటే దీన్ని హాయిగా పండించవచ్చు. గుత్తులు గుత్తులుగా వచ్చే కూరగాయ ఆరోగ్యానికి చాలా మంచిది కూడానూ. కావాల్సినపుడు నీళ్ళూ పోస్తూ, వీలైతే ఎరువులు తెచ్చి వేస్తే బాగుంటుంది.

బంగాళ దుంప

ఇంట్లో ఉద్యావనాన్ని తయారు చేయాలనే ఆలోచన వచ్చి ఏది పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నవారికి బంగాళ దుంపని మించినది లేదనే చెప్పాలి. ఒక ప్లాస్టిక్ సంచిలో కంపోస్ట్ ఎరువుతో కూడిన మట్టిని నింపి, దానిలో అంతకుముందే కత్తిరించుకున్న బంగాళ దుంప కన్నులని నాటాలి. ఈ బంగాళ దుంపకి రెండు కన్నులు ఉండేలా చూసుకోవాలి. ఒకరోజు వాటిని బాగా ఎండబెట్టి, ఆ తర్వాత రోజు నాటితే సరిపోతుంది. క్రమం తప్పకుండా నీళ్ళు అందిస్తే బాగుంటుంది.

చిక్కుడు కాయ

చాలా సులభంగా మొలిచే చిక్కుడుకాయ ఇంట్లో పెంచదగ్గ కూరగాయల్లో ఒకటి. రెగ్యులర్ గా నీళ్ళు అందిస్తూ ఉంటే కాయల్ని కాస్తూ ఉంటుంది. ఇంట్లో పెంచిన మొక్కలకి కాచే కూరగాయలు మహా రుచిగా ఉంటాయి. మీరు తినడానికి కాబట్టి, రసాయనాలు చల్లాల్సిన అవసరం ఉండదు. కంపోస్ట్ ఎరువు మీకు మీరే తయారు చేసుకుంటే బెటర్.

ఇంకా టమాట, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మొదలగు వాటిని కూడా ఇంట్లో పండించవచ్చు. కావాల్సిందల్లా వాటికి ఎన్నిసార్లు నీళ్ళు పట్టాలి. ఎంత పట్టాలి అని చూసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news