యువతలో హార్ట్ ఎటాక్స్ రావడానికి కారణం ఇవే.. వైట్ పాయిజన్ కు చెక్ పెట్టండి..!

-

వైట్ పాయిజన్స్ అని పేరు మీరందరూ వినే ఉంటారు.. సాల్ట్, తెల్లటి బియ్యం, పాలిష్ పట్టిన గోధమరవ్వ, పాలిష్ చేసిన పిండి, బొంబాయి రవ్వ, మైదాపిండి, పంచదార ఇలాంటి అన్నీ కూడా వైట్ పాయిజన్స్ గా అంటారు. ఇవన్నీ మనం తినేవి..కానీ పాయిజన్ అని ఎందుకు అన్నారంటే..ఇవి విషంతో సమానమేనట..స్లో పాయిజన్ లా..మన శరీరంలో చేరి..రక్షణవ్యవస్థను దెబ్బతీసి అనేక రకాల ఆరోగ్యసమస్యలు తెస్తాయి. ఇవన్నీ ఎంత డెంజరంటే..మీరు నెయ్యి, నూనె, నాన్ వెజ్ కొలెస్ట్రాల్ అనుకుంటారు..కానీ వైట్ పాయిజన్ వాటన్నింటికంటే..ఎక్కువగా కొలెస్ట్రాలన్ ను తయారుచేస్తుంది. తక్కవ సమయంలో ఎక్కువ బాడ్ కొలెస్ట్రాల్ తయారుచేసి..రక్తనాళాల్లో పూడికలు వచ్చేసి ప్రాణంతకం అవుతుంది. ఇలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ అవడం వల్ల హార్ట్ బ్లాక్స్ రావడం, బ్రెయిన్ స్టోక్ రావడం, రక్తప్రసరణ సంబంధం అయిన సమస్యలు రావడం జరుగుతుంది.

ఇంతకముందు గుండెజబ్బులు పెద్దోళ్లకే వచ్చేవి..కానీ ఇప్పడు కాలేజీలకు వెళ్లేవారికి, పెళ్లి చేసుకునే వయసున్న వారికి వచ్చేస్తున్నాయి. కారణం ఈ వైట్ పాయిజన్ ఆహారాలే. ముఖ్యంగా పిల్లలు ఇంట్లోవి తిని..బయట బ్యాకరీస్ లో వి తింటారు. కాబట్టి ప్రాబ్లమ్ పెద్దలకంటే..పిల్లలకే ఎక్కువ ఉంటుంది. ఇవి చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో పిల్లలు చాక్లెట్స్ కానీ, పిజ్జాలు ఇలాంటివి బాగా తినడానికి ఇష్టపడతారు. ఇక నుంచి అయినా..వీటి వాడకం తగ్గించకపోతే..భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. 20-25 ఏళ్లకే హార్ట్ స్ట్రోక్, పరాలసిస్ వస్తాయి. ఇప్పటికే ఈ సమస్య యవతలో వచ్చేసింది. మీ పిల్లలకు ఇకనుంచి అయినా ఇలాంటి ఫుడ్ ను తగ్గించాలని ప్రముఖ ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. అసలు వైట్ ప్రొడెక్ట్స్ లో ఎలాంటి లాభాలు ఉండవు..కేవలం కార్పోహైడ్రేట్స్ ఉండటం వల్ల బరువు మాత్రం పెరుగుతారు.

రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించాలంటే :

రక్తనాళాలో పెరుకోపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించాలంటే..గుడ్ కొలెస్ట్రాల్ ఏర్పడాలి..మరి ఇలా చేయాలంటే..HDL రక్తనాళాలను క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మరి ఇది మనకు 40-50 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ఉండాలి. ఇలా ఉండాలంటే..ఆహారనియమాలు, వ్యాయామాలు, ఒత్తిడి వీటిమీద శ్రద్ధ పెడితే..గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి..బ్యాడ్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. ఇలాంటి గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే..

విత్తనాలు బాగా ఉపయోగపడతాయి. మొలకెత్తిన విత్తనాలు బాగా తినండి. డ్రై ఫ్రూట్స్ బాగా తినండి..వాలనట్స్ బాదం, పిస్తా, పొద్దుతిరుగుడు గింజలు లాంటివి ఇవన్నీ గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. సోయా చిక్కుడు గింజలను నానపెట్టి ఉడకపెట్టి వాడుకున్నా..గుడ్ కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది. అవిసె గింజెలు.. వీటితో కారంపొడి చేసుకుని తినొచ్చు. ఇది గుండెకు చాలా మంచిది.

రెగ్యులర్ గా ఆకుకూరలు తినండి.

ప్రతిరోజు ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకుంటే.. రోజుకు 30 శాతం పండ్లు తింటే..గుండె ఆరోగ్యగా ఉంటుంది. కూరలు కూడా చప్పగా చేసుకుని ఎక్కువగా తినటం వలన..గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

వీటితో పాటు..వ్యాయామాలు కూడా చేస్తుండాలి. నడవడం కూడా మంచిదే.

మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారికి..ఎన్ని చేసినా..గుడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతున్నాయి. కాబట్టి వీలైనంత ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయండి. ప్రాణాయామం చేస్తే..మంచి రిలీఫ్ ఉంటుంది.

యాంటి ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్, నైట్రిక్ ఆక్సైడ్ రిచ్ ఫుడ్స్, రసవర్టాల్ రివర్స్ ఫుడ్ ను బాగా తీసుకోగలిగితే..ఆర్ట్రీస్ లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగించుకోవచ్చని సైంటిఫిక్ గా నిరూపించారు.

యాంటి ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అంటే..పుల్లటి పండ్లు, రేగ్గాయలు, నేరేడు, కమలాలు, బత్తాయిలు. ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్ ను బాగా తీసుకుంటే..మంచి కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది.

నైట్రిక్ ఆక్సైడ్ రిచ్ ఫుడ్స్ అంటే..వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, బీట్ రూట్, క్యాబేజీ, పాలకూర ఇలాంటివి.

ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు గుడ్ కొలెస్ట్రాలన్ పెంచుతాయి.

రెడ్ వైన్ తాగితే..గుండె ఆరోగ్యంగా ఉంటుందనుకుంటున్నారా…?

రెడ్ వైన్ అనేది గుండెకు చాలామంచిదని అనుకుంటారు. కొంతమంది అదేపనిగా..గుండె ఆరోగ్యం కోసం ఈ రెడ్ వైన్ తీసుకుంటారు. రెడ్ గ్రేప్స్ కి ఈస్ట్ ను, ఘగర్ ను కలిపి 3-5 వారాలు పులియబెట్టి తయారు చేస్తారు. ఈ ప్రాసెస్ లో ఆల్కాహాల్ రిలీజ్ అవుతుంది. దీన్ని బాటిల్ లో పోసేసి భూమిలో భద్రపరుస్తారు. రెడ్ వైన్ ను ఎన్నాళ్లు భద్రపరిస్తే అంత టేస్ట్ ఎక్కువగా ఉంటుందట. అమ్మేముందు ఫ్లేవర్స్ కలుపుతారు. ఎంత నిల్వ ఉంచితే..వాటికి అంత డిమాండ్ ఉంటుంది. దీన్ని ఫ్రాన్స్ వారు ఎక్కువగా తాగుతారట.

అయితే ఈ ఫ్రాన్స్ వాళ్ల మీద చేసిన పరిశోధనలో రెడ్ వైన్ తాగుతున్న వారిలో గుండెజబ్బులు తక్కువగా ఉంటున్నాయని కనుక్కొన్నారు.
రివస్ట్రాల్ అనే పదార్థం రెడ్ వైన్ లో ఉంటుంది. హైతాచిన్, ఎపీక్ ఎతాచిన్, ప్రోయాంతో సైనడిన్ యాంటిఆక్సిడెంట్ లా పనిచేసి..గుండెజబ్బులు రాకుండా రక్షిస్తుందని డెన్మార్క్ వాళ్లు చేసిన పరిశోధనలో తేలింది. హార్వాడ్ మెడికల్ స్కూల్ వాళ్లు 2014లో ఈ పరిశోధన తప్పని నిరూపించారు.అంటే ఫ్రాన్స్ వాళ్లు..కేవలం రెడ్ వైన్ మాత్రమే కాదు..నట్స్ ఎక్కువగా తింటారు, స్టీమ్డ్ ఫుడ్ తింటున్నారు, ఫ్రూట్స్, జ్యూస్లు ఎక్కవుగా తాగుతున్నారు…అందుకే హార్ట్ ఎటాక్స్ రావడం లేదని వాళ్లు నిరూపించారు.

కాబట్టి ఎవరైతే..గుండె ఆరోగ్యం కోసం అని రెడ్ వైన్ తాగుతారో వాళ్లు దానికి బదులు రెడ్ గ్రేప్స్ జ్యూస్ చేసుకుని తాగినా సరిపోతుంది. 150ML రెడ్ వైన్ కంటే ఎక్కువగా తాగితే…చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని సైంటిస్టులు నిరూపించారు.

గుండె ఆరోగ్యానికి పైన చెప్పిన అలవాట్లు మొదలుపెట్టండి..వైట్ పాయిజన్ కు గుడ్ బాయ్ చెప్పండి

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news