RRR: ఆదివాసీల జీవన ప్రతిబింబం ‘కొమ్మ ఉయ్యాల’..భుజంపై మల్లితో కొమురం భీమ్ ఎంట్రీ అదిరింది

-

మాస్టర్ స్టోరి టెల్లర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR ఘన విజయం సాధించింది. రికార్డుల వేటలో దూసుకుపోతున్న ఈ పిక్చర్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. హీరోలిద్దరూ తమ నట విశ్వరూపం చూపారని చెప్పొచ్చు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ చక్కటి నటన కనబర్చారు.

ఈ చిత్రంలోని పాటలను RRR మూవీ యూనిట్ సభ్యులు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తారు. ఇటీవల ‘నాటు నాటు’ సాంగ్ రిలీజ్ చేయగా, తాజాగా ‘కొమ్మ ఉయ్యాల’ సాంగ్ రిలీజ్ చేశారు. RRR మూవీ ఈ పాటతోనే మొదలవుతుంది. బ్రిటిష్ దొరసాని మల్లిని తీసుకెళ్లడంతో మూవీ స్టోరి స్టార్ట్ అవుతుంది. ఈ పాటను మూడేళ్ల చిన్నారి ప్రకృతిరెడ్డి ఆలపించగా, లిరిక్స్ సుద్దాల అశోక్ తేజ అందించారు.

ప్రకృతితో, అమ్మతో తమకు ఉన్న అనుబంధం, ఆదిలాబాద్ ఆదివాసీల జీవన ప్రతిబింబం పాటలో ఆవిష్కరించారు. ఇక మూవీ యూనిట్ సభ్యులు విడుదల చేసిన వీడియోపాటలో చివరలో కొమురం భీంగా జూనియర్ ఎంట్రీ అదిరిపోయింది.

బ్రిటీష్ వారి నుంచి పాపను విడిపించుకుని తమ గిరిజన తండాకు తన భుజంపైన కూర్చొబెట్టుకుని తీసుకొస్తుండటం చూస్తుంటే ప్రతీ ఒక్కరు ఎమోషనల్ అవుతారని చెప్పొచ్చు. ఈ కొమ్మ ఉయ్యాల వీడియో సాంగ్ ను మీరూ చూసేయండి..

Read more RELATED
Recommended to you

Latest news