ప్రపంచంలోనే అత్యంత సంపన్న పెంపుడు జంతువులు ఇవే.. ఆస్తి వందల మిలయన్ల పైనే..!

-

పెంపుడు కుక్కలను పెంచుకోవడం అందిరికీ ఇష్టం ఉంటుంది. వాటిని సొంత బిడ్డల్లాగా ప్రేమగా చూసుకుంటూ..ముద్దాడుతారు. కొందరికి కుక్కలే ప్రపంచం అవుతాయి. ఇంకా ఎవరూ లేకుండా ఒంటరిగా బతికే వాళ్లకు కుక్కలే అన్నీ అవుతాయి. వాటితోనే తమ సంతోషాన్ని, బాధను చెప్పుకుంటారు. అయితే కొన్ని పెంపుడు జంతువులకు వాటి యజమానులు సంపదను వాటి పేరు మీద రాశారు. అవి ఎంత రిచ్‌ అంటే..ఒక సామాన్య వ్యక్తి జీవితాంతం సంపాదించినా అంత వెనకేయలేడు. మరి ప్రపంచంలోనే రిచ్‌ పెట్స్‌ ఏవో తెలుసా..! వాటి సంపద చూస్తే కళ్లు తిరగాల్సిందే..!

ఈ పిల్లి $100 మిలియన్ల యజమానురాలట. దీనికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. ఈ పిల్లి “గ్రంపీ క్యాట్స్ వర్స్ట్ క్రిస్మస్ ఎవర్” చిత్రంలో కూడా నటించింది.

గున్థర్ IV ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క. ఈ జర్మన్ షెపర్డ్ డాగ్ సుమారు $ 400 మిలియన్ల ఆస్తికి యజమాని. గుంథర్ IV తన తండ్రి గుంథర్ III నుండి ఈ ఆస్తిని పొందాడు. అతను ఈ ఆస్తిని అతని భార్య కార్లోటా లిబెన్‌స్టెయిన్ నుండి పొందాడు. ఈ కుక్కకు వ్యక్తిగత పనిమనిషి కూడా ఉంది

ఈ పిల్లి దాని యజమాని మారిసా అసుంటా నుండి $ 13 మిలియన్లను వారసత్వంగా పొందింది. అయితే, అది కేవలం డబ్బు కాదు. పిల్లి ఇటలీ అంతటా అనేక విల్లాలు, ప్యాలెస్‌లు ,ఎస్టేట్‌లను వారసత్వంగా పొందిందట.

కొంచితా అనే ఈ కుక్క చివావా టిఫనీ నెక్లెస్ ,కష్మెరె స్వెటర్ ధరించి కనిపిస్తుంది. సోషలైట్ గెయిల్ పోస్నర్ కొంచితాకు $8.4 మిలియన్లను వారసత్వంగా పొందింది. ఇందులో మయామిలో వాటర్ ఫ్రంట్ ప్యాడ్ కూడా ఉంది.

గిగు అనే ఈ కోడి దివంగత బ్రిటిష్ ప్రచురణకర్త మైల్స్ బ్లాక్‌వెల్‌కు చెందినది. ఇది $15 మిలియన్లను వారసత్వంగా పొందింది.

బ్లాక్కీ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక పిల్లి, ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఎక్కింది. ఈ పిల్లి తన యజమాని బెన్ రీ మరణం తర్వాత $ 25 మిలియన్లను వారసత్వంగా పొందింది

సాడీ, సన్నీ, ల్యూక్, లైలా మరియు లారెన్ ఓప్రా విన్‌ఫ్రే కుక్కలు. ఓప్రా విన్‌ఫ్రే తన వీలునామాలో తన పెట్స్‌కు 30 మిలియన్ డాలర్లు ఇచ్చిందట.

ఏంటో.. ఇంతింత డబ్బును ఈ కుక్కలు, పిల్లులకు రాసిచ్చారు. వాటితో ఎంచక్కా పేదవాళ్లకు సాయం చేయొచ్చగా అని ఈ విషయం తెలిసిన కొందరు నెటిజన్లు అంటున్నారు. నోరులేని మూగ జీవులు ఏం చేసుకుంటాయి అసలు అని మరికొందు. అంటున్నారు. ఇంతకీ మీరేమంటారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version