ఎదుటి వారు మీ పట్ల ఆకర్షితులు కావడానికి ఈ టెక్నిక్స్ పాటించండి.

ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మొదటి చూపులో కలిగిన అభిప్రాయం అంత తొందరగా మారదు. అందుకే తొలిచూపుకి అంత ప్రాధాన్యత ఉంటుంది. తొలిచూపులోనే ఎదుటి వారిని ఆకర్షించాలని అందరికీ ఉంటుంది. అలా ఆకర్షించడానికి పాటించాల్సిన టెక్నిక్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా అమ్మాయిలు, ముందుగా మాట్లాడే అబ్బాయిలనే ఇష్టపడతారు. సంభాషణలు మొదలెట్టే అబ్బాయిలకి ఆకర్షితులవుతారు. ఇంకా సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటే ఈజీగా కనెక్ట్ అవుతారు. అలా అని కుళ్ళు జోకులు వేస్తే చీ అనేస్తారు. సందర్భానికి అనుగుణంగా మాటల్లో క్రియేటివిటీని చూపిస్తే, అట్రాక్ట్ అవుతారు.

ఎవరినైనా కలవడానికి వెళ్తున్నప్పుడు మీరు వేసుకునే డ్రెస్, ముఖ్యంగా షూస్ సరైనవి ఉండాలి. కాలికి వేసుకునే చెప్పులని బట్టి ఆకర్షితులవుతారని ఒకానొక పరిశోధనలో తేలింది.

కళ్ళలోకి సూటిగా చూస్తూ మాట్లాడండి. నవ్వేటపుడు కళ్ళలోకి చూస్తూ నవ్వితే, దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఎదుటి వారి గురించి ప్రశ్నలు అడగండి. వారి గురించి తెలుసుకుంటే, మీపై ఎక్కువ ప్రేమ కురిపిస్తారు.

మీలో పాజిటివ్ నెస్ కనిపిస్తే ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతారు. అందుకే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి.

మీరు నిలబడే విధానం, కూర్చునే విధానం కూడా లెక్కలోకి వస్తుంది. నిటారుగా నిలబడితే మీలో ఉన్న ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అందుకే, కూర్చునేటపుడైనా, నిలబడేటపుడైనా ఒక్కసారి ఆలోచిండి.

ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే ఎడమ చెవిలోనే చెప్పండి. ఆ ఇంపాక్ట్ పాజిటివ్ గా ఉంటుందని పరిశోధనలో తేలింది.

ముఖ్యంగా మీ గురించి మీరు ఎక్కువ చెప్పుకోవద్దు. ముందే చెప్పినట్టు, వారి గురించే అడగండి. వారి మీకు అట్రాక్ట్ అయితే మీ గురించి అడుగుతారు.