ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్ రైలు లో వీటిని చూసొచ్చేయచ్చు..!

-

ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీలో బయల్దేరింది. 16 రాత్రులు, 17 రోజుల టూర్ ఇది. ఈ యాత్ర ద్వారా పర్యాటకులు రామాయణానికి సంబంధించిన ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ చూసి రావచ్చు. నవంబర్ 7న మొదలైన యాత్ర నవంబర్ 25న ముగుస్తుంది. పూర్తి వివరాలలోకి వెళితే…

IRCTC
IRCTC

మొదట అయోధ్యలో ఆగుతుంది. అక్కడ శ్రీ రామజన్మభూమి ఆలయం, హనుమాన్ ఆలయం చూడచ్చు. అలానే నందిగ్రామ్‌లో భారత్ మందిర్, బీహార్‌లోని సీతామర్హి, జానక్‌పూర్‌లో సీత జన్మస్థలం కూడా చూడచ్చు. నెక్స్ట్ వారణాసి బయల్దేరుతుంది.

 10. నవంబర్ 16న మరో యాత్రను కూడా ప్రారంభించనుంది ఐఆర్‌సీటీసీ. శ్రీరామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్-మదురై రైలు నవంబర్ 16న బయల్దేరుతుంది. 12 రాత్రులు, 13 రోజుల టూర్ ఇది. ఇక నవంబర్ 25న శ్రీరామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్-శ్రీగంగానగర్ యాత్ర నవంబర్ 25న ప్రారంభం అవుతుంది.,[object Object],(Image: Twitter/PC Mohan)

వారణాసి, ప్రయాగ్, శృంగ్వేర్‌పూర్, చిత్రకూట్ వంటివి రోడ్డు మార్గం లో చూడచ్చు. నెక్ట్స్ నాసిక్ వెళ్తుంది. త్రయంబకేశ్వర్ ఆలయం, పంచవటి ఆలయాన్ని కూడా సందర్శించొచ్చు. హంపి, క్రిష్కింద కూడా చుట్టేయచ్చు. రామేశ్వరం చూసాక ఇది ముగుస్తుంది. ఆ తర్వాత రైలు ఢిల్లీ బయల్దేరుతుంది. దేఖో అప్నా దేశ్ కార్యక్రమంలో భాగంగా ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ని స్టార్ట్ చేసింది.

సెకండ్ ఏసీ బెర్త్‌కు ఒకరికి రూ.82,950, ఫస్ట్ ఏసీ బెర్త్‌కు రూ.1,02,095 చెల్లించాలి. ఏసీ హోటళ్లలో బస, శాకాహార భోజనం, ఏసీ వాహనాల్లో సైట్ సీయింగ్, ట్రైవెల్ ఇన్స్యూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. డీలక్స్ లగ్జరీ రైలులో పర్యాటకులు కోసం స్పెషల్ రెస్టారెంట్ వుంది. బెర్త్ చూస్తే హోటల్ గదిలా ఉంటుంది. డైనింగ్ రెస్టారెంట్స్, షవర్ క్యూబికల్స్, ఫుట్ మసాజర్ లాంటివి కూడా వున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news