ఫోన్ కు చార్జింగ్ పెట్టెటప్పుడు వీటిని తప్పక ఫాలో అవ్వాలిందే..

-

చదువున్నా లేకున్నా కూడా స్మార్ట్ ఫోన్ అందరికి ఉంటుంది.. ఆఖరికి భిక్షాటన చేస్తున్న వాళ్ళు కూడా ఫోన్ ను వాడుతున్నారు..ఈ ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయ్యింది..మొబైల్ లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం కష్టంగా అనిపిస్తుంది.ఎందుకంటే ఇప్పుడు ప్రజలు తమ మొబైల్స్ నుంచి చాలా పనులు చేయడం ప్రారంభించారు. ఇందులో కాల్ చేయడం, మెసేజింగ్ చేయడం, షాపింగ్ చేయడం, పేమెంట్స్ చేయడం, టిక్కెట్స్ బుక్ చేసుకోవడం మొదలైనవి ఉంటాయి.

మీరు స్మార్ట్ఫోన్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ మీరు ఎప్పుడైనా దాని లైఫ్ గురించి ఆలోచించారా..అసలు ఎలా చార్జింగ్ పెట్టాలి అన్నది తెలుసుకున్నారా..ఎలా పెట్టినా చార్జింగ్ ఎక్కుతుంది కదా అనుకోకండి..అలా అనుకుంటే పొరపాటే..మీరు రోజంతా ఫోన్ని ఉపయోగిస్తే, దాన్ని అన్ని సమయాలలో ఫుల్ ఛార్జ్లో ఉంచాల్సిన అవసరం లేదు. ఫోన్ను సరిగ్గా ఛార్జ్ చేయడానికి కూడా ఒక మార్గం ఉంది. మీరు ఫోన్ను సరిగ్గా ఛార్జ్ చేస్తే, మీ ఫోన్ బ్యాటరీ జీవితం బాగుంటుంది…అసలు ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాం..

100 శాతం ఫుల్ ఛార్జింగ్ చేసి ఆ తర్వాత హాయిగా వాడుకుందామని అనుకుంటారు. ఇది బ్యాటరీని ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది అనుకుంటాం. కానీ అది అలా కాదు. 80 నుంచి 90 శాతం వరకు ఫోన్ మాత్రమే ఛార్జ్ చేయాలని నిపుణులు భావిస్తున్నారు. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడం స్మార్ట్ఫోన్ జీవితానికి మంచిది కాదు. 100 శాతం ఛార్జ్ చేయవద్దు..

మరి కొంత మంది మాత్రం పూర్తిగా చార్జ్ అయిపోయాక చార్జింగ్ పెడుతుంటారు. మీరు కూడా అలాంటి వ్యక్తులలో ఉంటే, ఇది చేయకూడదని తెలుసుకోండి. ఫోన్ బ్యాటరీ 20 శాతం ఉన్నప్పుడు మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి. బ్యాటరీని 20 నుండి 80 శాతం వరకు ఉంచడం మీ ఫోన్కు మంచిదని అంటున్నారు..తక్కువైన, ఎక్కువైనా సమస్య అని గుర్తుంచుకోండి…

Read more RELATED
Recommended to you

Latest news