భారత్‌లో గత కొద్ది రోజులుగా విపరీతంగా ఉన్న కరోనా వల్ల ఇతర దేశాలు భారతీయులను తమ దేశంలోకి అనుమతించలేదు. కానీ ఇప్పుడు కొన్ని దేశాలు అనుమతులనిస్తున్నాయి. అయినప్పటికీ యురోపియన్ దేశాలకు టూర్ వెళ్లాలనుకునేవారు ఇప్పుడప్పుడే వెళ్లలేరు. యూకే అనుమతి ఇవ్వడం లేదు. అయితే యురోపియన్ దేశాలను చుట్టి రావాలనే ఏమీ లేదు, మన దేశంలోనూ ఓ చోట అచ్చం యురోపియన్ దేశాలను పోలిన వాతావరణం ఉంటుంది. అక్కడి ఆహారాలనే వండి వడ్డిస్తారు. దీంతో యురోపియన్ దేశాల్లో గడిపిన అనుభూతి కలుగుతుంది. మరి ఆ ప్రాంతం ఏదంటే..?
యురోపియన్ దేశాలకు వెళ్లాలనుకునే వారు యూరప్‌కే వెళ్లాల్సిన పనిలేదు. నాసిక్‌కు కూడా వెళ్లవచ్చు. అక్కడ విలాసవంతమైన విల్లాలు అందుబాటులో ఉన్నాయి. ప్రకృతికి దగ్గరగా గడపవచ్చు. అక్కడి ఆల్ ది జాజ్ అనే విల్లాల్లో ఒక డబుల్ బెడ్ రూమ్ విల్లాలో గడిపితే రోజుకు దాదాపుగా ఒక జంటకు రూ.36వేలు తీసుకుంటారు. ఇక త్రయంబకేశ్వర్ దగ్గర ఉన్న సాఫ్రన్ స్టేస్ రిథమ్ అండ్ బ్లూస్ అనే ఇంకో చోట విల్లాను రూ.68వేలకు రెంట్ తీసుకోవచ్చు. అందులో 6 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలను అనుమతిస్తారు.
ఇక విల్లా మీర్‌లో ఒక విల్లా రెంట్ రూ.57వేలు ఉండగా, అక్కడి అంజనెరి అనే ప్రాంతంలో ఉన్న ఇండీ హౌజ్ అనే మరో విల్లా రెంట్ రూ.64వేలుగా ఉంది. అలాగే స్కై విల్లాలో ఒక్క రాత్రికి రూ.32వేలు అవుతుంది. టుస్కాన్ సన్ అనే మరో విల్లాను రెండు రోజులకు రూ.85వేలు చెల్లించి రెంట్‌కు తీసుకోవచ్చు. ఈ విల్లాలన్నీ యురోపియన్ దేశాల్లోని వాతావరణాన్ని కలిగి ఉంటాయి. అక్కడి ఆహారాలనే అందిస్తారు. అలాగే బెడ్ రూమ్‌లు, ప్రత్యేక బాత్ రూమ్‌లు, ఇతర అన్ని సదుపాయాలు ఉంటాయి. మన దేశంలోనే యూరప్ లాంటి టూర్‌ను ఎంజాయ్ చేయాలంటే నాసిక్ వెళ్లవచ్చు.