కోట్లు ఖర్చుపెట్టి నాపై ఎంక్వయిరీ చేస్తున్నారు – కేటీఆర్

-

కోట్లు ఖర్చు చేసి తనపై ఎంక్వయిరీ చేస్తున్నారని అన్నారు బిఆర్ఎస్ పార్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈడీ విచారణ ముగిసిన సందర్భంగా ఈడీ ఆఫీసు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏసీబీ, ఈడీ సంస్థల ప్రశ్నలు ఒకేలా ఉన్నాయని అన్నారు. తాను ఎన్నిసార్లు పిలిచినా వస్తానని.. ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెబుతానని అన్నారు.

లేని అవినీతిపై కోట్లు ఖర్చుపెట్టి ఎంక్వయిరీ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు కేటిఆర్. తనపై పెట్టే ఖర్చుతో పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చునని అన్నారు. రేవంత్ రెడ్డి పై ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నాయని.. అందుకే తనపై కూడా ఈ కేసులు పెట్టించారని ఆరోపించారు.

“నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇద్దరం కలిసి జడ్జి ముందు కూర్చుందాం. ఇద్దరి కేసులపై లై – డిటెక్టర్ కేసులు చేయించుకుందాం” ని సవాల్ చేశారు. డేట్, టైమ్ రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. ఎవరి నిజాయితీ ఏంటో రాష్ట్రం మొత్తం చూస్తూందన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news