కొన్ని కొన్ని సార్లు మనం శత్రువులే ప్రమాదం అనుకొని వాళ్ళ నుంచి దూరంగా ఉంటూ ఉంటాం. వాళ్ల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటాము. అయితే నిజానికి శత్రువుల కంటే వీళ్ళు చాలా ప్రమాదం అని ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా తెలిపారు అయితే మరి ఎవరు ప్రమాదం ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మరి వాటి కోసం ఇప్పుడే చూద్దాం.
మన చుట్టూ కొంత మంది ఉంటారు వాళ్ళు నిజానికి శత్రువుల కంటే ఎంతో ప్రమాదం. అలాంటి వారికి దూరంగా ఉంటే మంచిది.
స్వార్థం తో ఉండే వ్యక్తులు:
కొందరికి స్వార్ధం ఎక్కువగా ఉంటుంది అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడూ కూడా స్వార్ధపరులు వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారికి దూరంగా ఉండాలి. వారితో స్నేహం కూడా చేయడం మంచిది కాదు.
దుష్టులు:
దుష్టులు, దురాశ ఉన్న వారితో కూడా జాగ్రత్త పడాలి. ఇటువంటి వాళ్లకి అసూయ ఎక్కువగా ఉంటుంది. ఇతరులు అభివృద్ధిని వాళ్ళు అస్సలు తట్టుకోలేరు కానీ మనం అందరూ స్నేహితులే కదా అని మన యొక్క విషయాలను వాళ్లతో పంచుకుంటూ ఉంటాము అటువంటి వాళ్ళు సంతోషించరు సరికదా అసూయ పడుతూ ఉంటారు. కనుక ఇటువంటి వ్యక్తులతో కూడా దూరంగా ఉంటే మంచిదని ఆచార్య చాణక్య అంటున్నారు.
కోపం తో ఉండే వ్యక్తులు:
కోపం ఎక్కువగా ఉండే వాళ్ళు ఇతరులకు హాని చేస్తూ ఉంటారు కాబట్టి కోపంతో ఉండే వాళ్ళతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు శత్రువు కంటే ప్రమాదం అని మీరు తెలుసుకుని వారికి దూరంగా ఉండడం మంచిది లేదంటే మీకు ఇబ్బందులు కలుగుతాయి అని గుర్తుంచుకోండి.