సాధారణంగా తాజా పండ్లు అన్ని రకాల రోగాలను నయం చేయడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి అని చెబుతూ ఉంటారు వైద్యులు. కానీ కొన్ని రకాల పండ్లు మాత్రం ప్రత్యేకించి కొన్ని జబ్బులో ఉన్న వారు తినకూడదని కూడా సూచిస్తున్నారు. అలాంటి వాటిలో బేరీ పండ్లు కూడా ఒకటి. ఇకపోతే ఈ పండ్లలో ని పోషకాలు కొన్ని రకాల సమస్యలు ఉన్న వారిపై ప్రతికూల ఫలితాలను చూపిస్తాయట. బేరీ పండ్ల నే మనం పియర్స్ అని కూడా అంటూ ఉంటాము. చూడడానికి జామపండు వలె ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
ఇందులో ఉండే ఫైబర్ , మినరల్స్ , విటమిన్లు పుష్కలంగా మన శరీరానికి లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉండడం వల్ల ఈ ఫ్రూట్ తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాదు కొంతమంది తినడం వల్ల మరికొన్ని దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా అజీర్తి సమస్యతో బాధపడుతున్న వారు ఈ పియర్స్ పండ్ల ను తినకుండా ఉండడమే మేలు.. ఎందుకంటే దీనిని తిన్న తర్వాత జీర్ణక్రియలో సమస్యలు ఏర్పడతాయి. సమస్య ఉన్నవారు ఉదయం, నైటు అసలు తినకూడదు. ఒకవేళ ఇది తిన్నట్లయితే తిమ్మిరి , గ్యాస్ వంటి సమస్యల బారిన పడతారు.
జలుబు , దగ్గు ఉన్నవారు కూడా ఈ పండ్లను తినకూడదు. వీటిని తినడం వల్ల శరీరం చల్లబడుతుంది.. అలాంటప్పుడు ఈ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. వీటిలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఒకవేళ మీరు ఈ పండును ఎక్కువగా తీసుకున్నట్లయితే బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. హై బీపీ ఉన్నవారు, ఈ పియర్స్ ను తక్కువ మొత్తంలో తీసుకుంటే మంచి లాభం అవుతుంది.. లేకపోతే మూర్ఛ, మైకం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వంటి సమస్యలు ఎదురవుతాయి.