జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదుల హతం…

జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. ఇటీవల కాలంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తరుచుగా ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్నాయి. తాజాగా మరోసారి భద్రతా బలగాలు, ఉగ్రవాదలు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుతున్నాయి. సెంట్రల్ కశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలోని రంగ్రెత్ ప్రాంతంలో సోమవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. 

ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు జాయింట్ గా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ప్రతీ దాడి  చేశాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే వీరెవరనేది ఇంకా గుర్తించలేదు. అంతకుముందు రోజు ఆదివారం అవంతిపోరా జిల్లా బరగ్రామ్ ప్రాంతలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది మరణించారు.