ఈయన 106 ఏళ్ల వృద్ధుడు…! మహా బలశాలి కరోనా మహమ్మారిపై ఘనవిజయం సాధించాడు. ఆయనకు ఇటీవలే కరోనా సోకడంతో ఢిల్లీ లోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆయనతో పాటు ఆయన భార్య కుమారుడు అతని కుటుంబ సభ్యుడు ఒకరు… మొత్తం నలుగురికి కరోనా సోకింది. నలుగురు ఆసుపత్రిలో ఇసోలేషన్ లో ఉండగా అందరికన్నా ముందు ఆయనకే వ్యాధి నయం అయ్యింది దాంతో అక్కడి డాక్టర్లు షాకయ్యారు. కాగా వారి కుటుంబంలో అందరికీ వ్యాధి నయం అవ్వడంతో ఇటీవలే ఆయన డిశ్చార్జ్ అయ్యాడు.
ఈ విషయాన్ని వెల్లడించిన డాక్టర్లు ఆయన గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఆయనకు గతంలో కూడా ఇలాంటి వ్యాధే సోకింది అదే స్పానిష్ ఫ్లూ… స్పానిష్ ఫ్లూ అనే మహమ్మారి 1918 సంవత్సరంలో భారీగా విజృంభించింది ఆ కాలం లోనే ఆ వ్యాధితో దాదాపుగా 4 కోట్ల మంది మరణించారు. అదే కాలం లో ఈ వృద్ధుడు కూడా ఆ మహమ్మారితో పోరాడాడు అప్పుడు కూడా ఈ వృద్ధుడు ఆ మహమ్మారి పై విజయం సాధించాడు. పేరుకే వృద్ధుడు కానీ బాగా బలశాలి అని వైధ్యులు సైతం ఈయన గురించి చెబుతున్నారు.