అమెరికాలో ఇప్పుడు ఈ భారతీయుడే హీరో…!

-

కరోనా సమయంలో ముక్కూ ముఖం తెలియకపోయినా 70 మందికి పైగా అమెరికన్లకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించాడు ఓ భారతీయడు. ఇప్పుడు భారతీయ సంతతి వ్యాపారవేత్తను హీరో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. భారతీయుడు అమెరికాలో ఇప్పుడు హీరో అయ్యాడు. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న నిరసనలు, గొడవల గురించి తెలిసిందే.

indian

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా ఏమాత్రం పరిచయం లేని 75 అమెరికన్లకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించిన ఓ భారతీయ వ్యాపారి ఇప్పుడక్కడ హీరో అయ్యాడు. ఆయనే 44ఏళ్ల రాహుల్ దూబె. 17ఏళ్లుగా వాషింగ్టన్ డీసీలో ఉంటూ అల్వారెజ్ ట్రేడింగ్ పేరుతో కంపెనీని నిర్వహిస్తున్నారు.

తాజాగా ఆఫ్రికన్-అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ మృతికి అమెరికన్లు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. వారిపై పోలీసలు వాటర్ స్ప్రే, పెప్పర్ స్ప్రే ఉపయోగిస్తూ చెదరగొడుతున్నారు. రాత్రి కర్ఫ్యూ కావటంతో ఉదయం నుంచీ నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు చెదరగొడుతున్నారు. వారి నుంచి తప్పించుకుంటూ, పరుగులు తీస్తూ సమీపంలోని దూబె ఇంటి పెరట్లో కొంతమంది ఆగిపోయారు. వారిలో ఒకరు ఫోన్ చార్జింగ్ అడిగ్గా.. ఇంకొకరు బాత్రూమ్ అడిగారని తెలిపారు.

అలా చాలామంది వస్తూండటంతో వారందరినీ వారించలేక ఇంట్లోకి తీసుకెళ్లిపోయారు. అలా 75మంది చేరారు. వారందరికీ ఆహారం అందించి ఆశ్రయమిచ్చారు. రాత్రికి అక్కడే హాల్లోని సోఫాల్లో, బాత్ టబ్ లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడే నిద్రపోయారు. వచ్చిన వారిలో ఓ మహిళ, చిన్నారి ఉండటంతో వారికి తన కొడుకు గది కేటాయించారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఒకరికొకరు సాయం చేసుకున్నారు.

అయితే మంగళవారం ఉదయం కర్ఫ్యూ సడలింపు తర్వాత వారంతా వెళ్లిపోయారు. ఈ విషయాలన్నింటినీ ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు దూబె. దీంతో దూబే అమెరికాలో హీరో అయ్యాడు. ఆయన చేసిన సాయాన్ని పొందిన వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సందేశం చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news