శభాష్ జగన్: అన్నా అన్నా అంటూనే స్టార్ట్… జాగ్రత్త “అన్న”లూ!

-

  • చంద్రబాబుకు భయం అనిపించినప్పుడల్లా, సమస్య వచ్చినప్పుడల్లా… జనాల మధ్యకు వచ్చి “తమ్ముళ్లూ” అని సంబోదిస్తుంటారు.. వారి నుంచి సమాధానాన్ని ఆశిస్తుంటారు అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తుంటాయి! ఆ సంగతులు అలా ఉంటే.. తమ ఎమ్మెల్యేలు, మంత్రులూ, నాయకులందరినీ “అన్నా” అని సంబోదిస్తుంటారు వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్! వ్యక్తిగత మీటింగుల్లోనే కాకుండా… వీడియో కాంఫరెన్స్ లలోనూ, అధికారిక మీటింగ్ లలోనూ కూడా చెప్పండి “అన్నా”… అంటూ పిలుస్తుంటారు! ఈ క్రమంలో ఆ “అన్న”లు అవినితీ చేసినా కూడా వదిలేది లేదని జగన్ చెప్పబోతున్నారంట!

    తమ్ముడు తమ్ముడు పేకాట పేకాటే అనేది బాబు గ్రహించకపోయినా… అవినీతి విషయంలో అన్నా తమ్ముడు అనే తేడాలు చూసేది లేదని జగన్ చెప్పబోతున్నారంట! ఇందులో భాగంగా టీడీపీ నేతలు గతంలో చేసిన అవినీతీ బాగోతాలపై జగన్ ఏ రేంజ్ లో ఫైరవుతున్నారో.. మరే రేంజ్ లో చర్యలు తీసుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం! ఈ క్రమంలో తమ పార్టీలో అవినీతి కార్యక్రమాలకు ఎవరైనా ఎమ్మెల్యేలు, మంత్రులూ పాల్పడుతున్నారా అనే విషయాలపై జగన్ దృష్టి సారించారని చెబుతున్నారు!

గతకొన్ని రోజులుగా పేదలకు ఇళ్లస్థలాల విషయంలో అవినీతి అక్రమాలు జరిగాయని కథనాలు వస్తున్న నేపథ్యంలో.. దీంతో పాటు తన దృష్టికి రాకుండా మరెన్ని కక్కుర్తి పనులు చేశారనే విషయంపై జగన్ సీరియస్ అవుతున్నారని.. ప్రత్యేకంగా ఫోకస్ చేశారని.. నిఘా విభాగాల ద్వారా ప్రతి రోజు ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రికి సంబందించిన కదలికల్ని.. కొత్తగా వచ్చిన మార్పులను.. అవినీతి ఆరోపణల మీద నివేదికలను తెప్పించుకుంటున్నారని తెలుస్తోంది.

అవినీతి అంటే… రాజకీయ ప్రత్యర్ధులు చేసేది మాత్రమే కాదని.. ఎవరు చేసినా వదిలేదిల్ లేదని జగన్ ఫిక్సయ్యారని దీన్ని బట్టి అర్ధమవుతుందని, జగన్ ఆ దిశగా చర్యలు తీసుకోవడం అభినందనీయమని ఈ సందర్భంగా కామెంట్లు వినిపిస్తున్నాయి!

Read more RELATED
Recommended to you

Latest news