పుష్ప 2 లో సాయి పల్లవి పాత్ర ఇదే..భారీ స్కెచ్ వేసిన సుక్కూ..!

-

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే డీ గ్లామరస్ పాత్రలో నటీనటులు ఇద్దరు అదరగొట్టేసారని చెప్పవచ్చు. అంతేకాదు అల్లు అర్జున్ వైకల్యం ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో పాటలు మాత్రమే కాదు సన్నివేశాలు కూడా యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో మంగళం శీను పాత్రలో కమెడియన్ సునీల్, దాక్షాయిని పాత్రలో యాంకర్ అనసూయ చాలా బాగా తమ పాత్రలకు ప్రాణం పోశారు.

ఇకపోతే పుష్ప 2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని దర్శకుడు సుకుమార్ కూడా వెల్లడించాడు. అయితే ఈసారి కొంచెం వినూత్నంగా ఆలోచించినట్లు తెలుస్తోంది. ఇందులో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవిని కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఆమె మన్యం బిడ్డగా మనకు కనిపించబోతుందట. అడవిలో ఉండే అమ్మాయి పాత్రలో సాయి పల్లవి నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర కోసం సాయి పల్లవిని దర్శకనిర్మాతలు సంప్రదించగా ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.Sai Pallavi Fans Go Crazy, Not Allowing Pushpa Director Sukumar To Deliver A Speech Amid Their Loud Cheersఇక సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తోందని చెప్పడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అంటూ అప్పుడే జ్యోతిష్యం చెప్పడం మొదలుపెట్టారు. ఇకపోతే పుష్ప సినిమా విపరీతంగా ఆకట్టుకోవడంతో నటీనటులకు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించింది.ఇక ఈ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అయితే సాయి పల్లవికి కూడా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వస్తుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news