తెలుగు చిత్ర సీమలో దర్శకుడు అనే పదానికి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ దాసరి నారాయణరావు అని సినీ పెద్దలు చెప్తుంటారు. దర్శకుడిగానే కాక రచయితగా, టెక్నీషియన్ గా అన్ని రంగాలపైన పట్టు సాధించిన వ్యక్తి దాసరి నారాయణరావు. ఆయన దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ తో పాటు అగ్రతారలందరూ నటించారు. దాసరి నారాయణరావు సమకాలీకుడు అయిన కె.రాఘవేంద్రరావు ఆయన గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ సినిమాలు తాను తీసినప్పటికీ ఏనాడు మాట్లాడలేదని, ఆ సందర్భంలో తన తరఫున కూడా మాట్లాడిన దాసరి నారాయణరావు అంటే తనకు అమితమైన గౌరవమని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చెప్పారు. దర్శకుడు అనే పదానికే గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి దాసరి నారాయణ రావు అని తన తండ్రి కె.ఎస్.ప్రకాశ్ తనకు చెప్పారని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు.
తను తీసిన సినిమాలు సూపర్ హిట్ అయితే దాసరి నారాయణరావు సంతోషపడేవారని, ఆయన తీసిన సినిమాలు బ్లాక్ బాస్టర్స్ అయితే తాను ఆనందపడేవాడినని తెలిపారు. ఇండస్ట్రీలో హెల్దీ కాంపిటీషన్ ఉండేదని వివరించారు. కె.రాఘవేంద్రరావు ఇటీవల నటుడిగానూ వెండితెరకు పరిచయం అయ్యారు. కాగా, అప్పట్లోనే దాసరి నారాయణరావు దర్శకుడిగా ఉండి నటుడిగా పలు సినిమాలు చేశారు.
చివరి వరకు పలు సినిమాలను నిర్మించడంతో పాటు నటుడిగా దర్శక రత్న దాసరి నారాయణరావు పని చేశారు. ఇక ఇటీవల నటుడిగా పరిచయం అయిన కె.రాఘవేంద్రరావు పలు సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండటంతో పాటు అతిథి పాత్రలు పోషిస్తున్నారు.