లోక్సభ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేసిన గిరిజనుడి ఫొటోను పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 2024 ఎన్నికల్లో బెస్ట్ ఫొటో ఇదేనంటూ కొనియాడారు. గ్రేట్ నికోబార్ ద్వీపంలోని దట్టమైన అడవుల్లో నివసించే షోంపెన్ తెగకు చెందిన ఏడుగురిలో ఒకరు మొదటిసారి ఓటేశారు. ప్రజాస్వామ్యానికి ఎదురులేదని, తిరుగులేని శక్తి అని మహీంద్రా కొనియాడారు.
కాగా, ఈరోజు దేశంలో ఐదో దశ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇందులో భాగంగా దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 56.68 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. కాగా, ఐదో దశలో యూపీలోని 14, మహారాష్ట్రలోని 13, బెంగాల్‌లోని 7,ఒడిశాలోని 5, బిహార్‌లోని 5, జార్ఖండ్‌లోని 3, జమ్మూకశ్మీర్ ,లద్ధాఖ్‌లోని చెరో లోక్‌సభ స్థానానికి ఎన్నికల జరిగాయి. మొత్తం 695 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. వారిలో 613 మంది పురుషులు, 82 మంది మహిళలు ఉన్నారు.