ఉగ్రదేవతామూర్తులు ప్రతిష్టాకాలం ఇదే !

-

కర్కాటక సంక్రాంతితో ‘దక్షిణాయన’ ప్రవేశం అవుతుంది. ఆషాఢమాసంలో దక్షిణాయనం. సూర్యుడు ప్రతి నెలలోనూ ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనికే ‘సంక్రమణం’ అని పేరు. కర్కాటకంలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే- సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలోకి వెళ్లేంత వరకు ఉండే కాలం ‘దక్షిణాయనం’. ఈ అయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయనం రాత్రి. ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరం. ఈ కాలంలో ఏయే కార్యాలు చేయాలి, వాటి విశేషాలు తెలుసుకుందాం…

ఉగ్రమూర్తుల ప్రతిష్ట

దక్షిణాయనంలో- దేవతా ప్రతిష్ఠ, గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహం వంటి శుభకార్యాలను చేయడం మంచిది కాదంటారు. కాని, దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను- అంటే సప్తమాతృకలు, భైరవ, వరాహ, నరసింహ, మహిషాసురమర్దిని, దుర్గ లాంటి దేవతా మూర్తులను ప్రతిష్ఠించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లో- ఈ పుణ్యకాలంలో ఆషాఢ స్నానాలు ఆచరించే సంప్రదాయం ఉంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేష ఫలాన్నిస్తాయి. ఆషాఢంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు మొదలైన వాటిని దానం చేయడం మంచిది.
కర్కాటకంలోను, కన్యలోను, ధనుస్సులోను, కుంభరాశిలోను సూర్యుడు ఉన్నప్పుడు చూడాకర్మ మొదలైనవి నిషిద్ధాలు. అవండి విశేషాలు. ఇలా ఆయా మాసాలలో అనేక రకాల కార్యాకార్యాల నియమం ఉంది.

-శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news