క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ సిరీస్ షెడ్యూల్ విడుదల అయ్యింది. అయితే ఈ సారి ఆస్ట్రేలియా పర్యటనలో ఇండియా అయిదు టెస్టులు ఆడనుంది.ఇప్పటివరకూ ఎక్కువగా నాలుగు టెస్టుల సిరీస్‌గా దీన్ని నిర్వహించారు. ఇలా రెండు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ నిర్వహించడం 32 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. ”1991-92 తర్వాత తొలిసారి ఇండియా-ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయి. నవంబర్‌లో ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో డే/నైట్ టెస్టు కూడా ఉంది.నవంబర్ 22 నుంచి జనవరి 7 వరకు జరగనుంది.పెర్త్ వేదికగా నవంబర్ 22న తొలి మ్యాచ్ జరుగుతుండగా,డిసెంబర్ 6 నుంచి మొదలయ్యే రెండో టెస్ట్ కి అడిలైడ్ ఆతిథ్యం ఇవ్వనుంది.మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26-30 వరకి బాక్సింగ్‌డే టెస్టు జరగనుంది. ఇక ఆఖరి టెస్టు జనవరి 3 నుంచి సిద్దిపేట జరగనుంది.
ఆస్ట్రేలియా vs ఇండియా షెడ్యూల్
తొలి టెస్టు: నవంబర్ 22-26 (పెర్త్)
రెండవ టెస్టు : డిసెంబర్ 6-10 (అడిలైడ్) (D/N)
మూడవ టెస్టు: డిసెంబర్ 14-18 (గబ్బా, బ్రిస్బేన్)
నాలుగవ టెస్టు: డిసెంబర్ 26-30 (మెల్ బోర్న్)
ఐదవ టెస్టు: జనవరి 3-7(సిడ్నీ)