కీర్తి తర్వాతి ప్రాజెక్ట్ ఇదే, టాప్ డైరెక్టర్ తో…!

-

ఇటు తెలుగు అటు తమిళ్ ఏ భాషలో అయినా సరే నేనే నెంబర్ 1 అంటుంది కీర్తి సురేష్. రెండు భాషల్లో కూడా వరుసగా సినిమాలు స్టార్ హీరోలు, స్టార్ దర్శక నిర్మాతలతో చేస్తూ దూసుకుపోతుంది. హీరోలతో సంబంధం లేకుండా సోలో గా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది. దాదాపు ఆమె ఇప్పుడు రెండు భాషల్లో కూడా మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్.

తాజాగా మరో సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఆమె సినిమా చేస్తుంది. దీనికి సంబంధించి ప్రకటన చేసింది కీర్తి. తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టర్ ని కూడా ఆమె పోస్ట్ చేసింది. సాని కాయిదం అనే టైటిల్ తో ఆమె ఈ సినిమా చేస్తున్నారు. సెల్వ రాఘవన్ తో సినిమా చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని కీర్తి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news