శివుడి మూడో కన్ను వెనుక అసలు నిజం ఇదే..!

-

మనం పూజించే ఏ దేవుడికి మూడు కళ్లు లేవు. కేవలం శివుడికి మాత్రమే త్రినేత్రుడు, త్రయంబకేశ్వరుడని కొలుస్తుంటాం. సాధారణంగా మూడో కన్ను ఉంటే చూడటానికి అందవికారంగా కనిపిస్తారు. కానీ శివుడికి మూడోకన్నే అందం. అందుకే ముక్కంటిగా పూజింపబడుతున్నాడు. మూడు కళ్లతో శివుడు కొలువైన ప్రాంతాన్ని త్రయంబకేశర్వంగా పిలుస్తారు. తప్పు చేసిన వారిని, సాధుసజ్జనులను హింసించిన వారిపై శివుడు మూడో కన్ను తెలిచి అగ్ని ప్రళయాన్ని సృష్టిస్తాడని అందరి నమ్మకం.

శివుడు
శివుడు

శివుడి మూడో కన్ను గురించి చాలా మంది చాలా రకాలుగా చెబుతుంటారు. ఈ విషయంపై పండితులు చెప్పే మాట ఎంటంటే.. శివుడి మూడో కన్ను భక్తుల్లో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని చెబుతుంది. ప్రతి మనిషిలోనూ అంతర్‌ నేత్రం ఉంటుంది. అదే జ్ఞాన జ్యోతిని ప్రసాదిస్తుందని పండితులు చెబుతుంటారు. దీనినే మనోనేత్రమని కూడా చెబుతుంటారు. ప్రతి మనిషిలోనూ జ్ఞాన జ్యోతి అనేది వెలుగుతూనే ఉంటుంది. ఆ వెలుగుని దర్శంచుకున్న వాడే మహాజ్ఞాని అవుతాడని పండితులు తెలిపారు. అయితే రెండు కళ్లుతో ఒక్కోసారి న్యాయమేదో.. అన్యాయమేదో చూడలేమని, అందుకే న్యాయస్థానంలో న్యాయదేవతకు కళ్లకు గంతలు కట్టి ఉంటాయి. న్యాయమూర్తులు కూడా తమ రెండు కళ్లతో చూడకుండా మనోనేత్రంతో వాస్తవాన్ని తెలుసుకోవాలని దాని అర్థం.

సాక్షాత్తు మన్మథుడు వచ్చి శివుడిని ప్రేరేపించటానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఆ కాముడిని తన మూడోకంటితో భస్మం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. మనోనేత్రంతో కోరికలను కూడా జయించవచ్చని పండితులు తెలిపారు. సామాన్య మానవుడిలో సాధుత్వం, సమతుల్యత, దూరదృష్టి ఉండాలి. పర స్త్రీని తల్లిగా భావించాలి. ఇతరుల ధనం కోసం ఆశపడకూడదు. సన్మార్గంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడానికి మనోనేత్రంతో పని చేయాలని పండితులు చెబుతున్నారు. మనిషిలో మూడో నేత్రం తెరుచుకున్నప్పుడు పెను చీకటికి దూరంగా ఉన్న పరమాత్మను జయిస్తాడని పండితులు చెబుతుంటారు. ఒకసారి శివుడు దీక్షలో ఉన్నప్పుడు.. పార్వతీదేవీ అక్కడికి వచ్చి శివుడిని ఆటపట్టిస్తుంది. శివుడి రెండు కళ్లకు తన చేతులతో మూసివేస్తుంది. అప్పుడు ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోతుంది. ముల్లోకాలు అయోమయం అవుతాయి. ఆ సమయంలో శివుడు తనకున్న దివ్యదృష్టితో మూడోకన్ను తెరుస్తాడు. అప్పుడు ఆ కంటి అగ్ని ప్రజ్వలించడంతో ముల్లోకాలలో ఉన్న చీకటి తొలగిపోతుందని యోగీశ్వరులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news