అధికారులు జగన్ తో కలిసి చిప్పకూడు తినడానికి సిద్ధంగా ఉండండి !

-

కృష్ణాజిల్లా మచిలీపట్నం లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. ఎన్నికల సందర్భంగా నిన్న కొల్లు రవీంద్ర అలాగే పోలీసు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించారనే ఆరోపణలతో కొల్లు రవీంద్ర పై పలు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులో ప్రకారం ఆయనను కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్టు చేసి పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే కొల్లు రవీంద్ర అరెస్టుతో మచిలీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది, కొల్లు రవీంద్ర నివాసానికి స్థానిక టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున చేరుకుంటున్నాయి. కొల్లు రవీంద్ర అరెస్టు అక్రమమని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ అక్రమాలను అడ్డుకున్న బీసీ నేతలను ఎందుకు వేధిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

సీఎం జగన్ బి.సి వ్యతిరేకి అని పేర్కొన్న చంద్రబాబు వైసీపీ హయాంలోనే బీసీలకు మీద దాడులు అరెస్టులు పతాక స్థాయికి చేరాయని అన్నారు. దొంగ ఓట్లు వేసిన వైసీపీ నేతలపై పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా అని చంద్రబాబు ప్రశ్నించారు. కొల్లు రవీంద్ర అరెస్టును మాజీ మంత్రి సోమిరెడ్డి, మాజీ మంత్రి నారా లోకేష్ ను ఖండించారు. అన్యాయాన్ని ప్రశ్నించే వారిని అరెస్టు చేస్తారా ? రెండేళ్ళలో అన్యాయానికి గురవుతున్న టిడిపి నేతలు నేరస్తులా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఇక కొల్లు రవీంద్ర అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసి జగన్ రాక్షసానందం పొందుతున్నారని అన్నారు. వైసీపీ నేతలు చెప్పినట్లు చేస్తున్న కొంతమంది అధికారులు జగన్ రెడ్డితో కలిసి చిప్పకూడు తినడానికి సిద్ధంగా ఉండాలని లోకేష్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news