ఈ ప్రపంచంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు.. వారంత సేఫ్ ప్లేస్ కోసం వెతుకుతున్నారు. అన్నీ భద్రతలు ఉండి, మనుషులకు సేఫ్ గా ఉండే ప్రదేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..శాంతిభద్రతల పరంగా చూసినా సురక్షిత దేశాల డిమాండ్ పెరుగుతోంది. ఈ కోణంలో ప్రపంచంలో ప్రఖ్యాత గ్యాలప్ అధ్యయనం శాంతి భద్రతల పరంగా సురక్షిత దేశాల జాబితా విడుదల చేసింది.
ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన మరియు తక్కువ సురక్షితమైన దేశాలను గ్లోబల్ అనలిటిక్స్ కంపెనీ తన నివేదికలో వెల్లడించింది. గ్యాలప్ సంస్థ ప్రచురించిన లా అండ్ ఆర్డర్ ఇండెక్స్ 2022 తూర్పు ఆసియాను ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఖండంగా పేర్కొంది. ఈ జాబితాలో అత్యంత సురక్షిత దేశంగా సింగపూర్ అగ్రస్ధానంలో నిలవగా.. అత్యల్ప సురక్షిత దేశంగా ఆప్ఘనిస్తాన్ చివరి స్ధానంలో ఉంది. ఇందులో భారత్ సహా పలు దేశాలకూ నిరాశ తప్పలేదు.
గ్యాలప్ అధ్యయనంలో భారత్.. బ్రిటన్, బంగ్లాదేశ్‌ల కంటే వెనుకబడిన 60వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ కూడా 48వ స్థానంలో నిలిచి భారత్ కంటే సురక్షిత దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. 1 నుండి 100 వరకు ఉన్న ఇండెక్స్‌లో భారత్ కు 80 పాయింట్ల స్కోర్ లభించగా..పాకిస్తాన్ 82 స్కోర్ చేసింది. ఓ దేశంలో ఎక్కువ మంది ప్రజలు సురక్షితంగా ఉన్నారనే దానికి ఈ సూచీ ప్రామాణికంగా నిలుస్తోంది. శ్రీలంక 80 పాయింట్లు స్కోర్ చేసి భారత్‌తో సమానంగా ఉంది. అయినా భారత్ కంటే మెరుగైన ర్యాంక్ లోనే ఉంది..
మూడేళ్లుగా ఆప్ఘనిస్తాన్ చివరి స్ధానంలోనే ఉంటోంది. తాలిబన్ల పాలన రాకముందు నుంచే ఆప్ఘన్ లో సాగుతున్న అంతర్యుద్ధ పరిస్ధితులు, శాంతిభద్రతల్ని దారుణంగా మార్చేశాయి. దీంతో ఆప్ఘన్ కు చివరి స్ధానం తప్పడం లేదు. మరోవైపు సింగపూర్ మాత్రం ఎప్పటిలాగే ఈ అధ్యయనంలో 96 పాయింట్లు సాధించి అత్యంత సురక్షిత దేశంగా తొలి ర్యాంకు సాధించింది. ఈ సర్వేలో 120 దేశాలకు చెందిన లక్షా 27 వేల మందిని ఒక్కొక్కరికి నాలుగు ప్రశ్నలు వేసి ఈ అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది.. అందుకే సింగపూర్ బాగా రిచ్ దేశం అయ్యింది కాబోలు..