బాలీవుడ్​ నుంచి యశ్​కు వరుస ఆఫర్స్​… బ్ర‌హ్మాస్త్ర సీక్వెల్‌లో రాకీ!

-

కేజిఎఫ్ లాంటి బిగ్గెస్ట్ హాట్ తరువాత కన్నడ స్టార్ హీరో యష్ ఏ సినిమా చేస్తున్నాడు..? ఏ బ్యానర్ లో చేస్తున్నాడు..? అనే దానిపై ఇప్పటికి చర్చ జరుగుతూనే ఉంది. కానీ, ఇప్పటివరకు యశ్ మాత్రం తన తదుపరి చిత్రాన్ని ప్రకటించింది లేదు. ఇక చాలా కథలు., మంచి బ్యానర్లు యష్ వద్దకు వస్తున్నా అతను మాత్రం ఆచితూచి అడుగేయాలని కొద్దిగా సమయం తీసుకుంటున్నడని సమాచారం. ఇక తాజాగా యష్ కు బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చినట్లు తెలుస్తోంది.

‘కేజీఎఫ్ -2’ సినిమాతో పాన్ ఇండియ‌న్ స్టార్‌గా మారిపోయారు కన్నడ స్టార్​ హీరో య‌శ్‌. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ రూ. 1200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో ప‌లు రికార్డుల‌ను సైతం తిర‌గ‌రాసింది. ఈ అద్వితీయ విజ‌యం త‌ర్వాత య‌శ్‌తో సినిమాలు చేసేందుకు ప‌లువురు బాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్ ముందుకు వస్తున్నారు. మ‌హాభార‌తంలోని క‌ర్ణుడి పాత్ర ఆధారంగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రాకేశ్​ ఓం ప్ర‌కాశ్​ మెహ్రా ఓ భారీ బ‌డ్జెట్ సినిమాను తెర‌కెక్కించనున్నారు. ఈ సినిమాలో క‌ర్ణుడి పాత్ర కోసం య‌శ్‌ను రాకేష్ ఓం ప్ర‌కాష్ మెహ్రా సంప్ర‌దించారట.

కరణ్ జోహార్.. బ్రహ్మాస్త్ర 2 కోసం యష్ ను దింపాలని ప్లాన్ చేస్తున్నాడట. పార్ట్ 1 లో శివ గా రణబీర్ కపూర్ కనిపించగా.. పార్ట్ 2 దేవ్ లో యష్ ను హీరోగా నటింపచేయాలని కరణ్ చాలా కష్టపడుతున్నాడట. ఇప్పటికే యష్ తో మాట్లాడగా.. ఆయన సున్నితంగా తిరస్కరించారట. అయినా పట్టువదలని విక్రమార్కుడులా బాలీవుడ్ మొత్తం యష్ ను రంగంలోకి దింపాలని చూస్తుందని టాక్ నడుస్తోంది. గత కొన్ని నెలలుగా బాలీవుడ్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది.

ఒక్క హిట్ వారికి చాలా అవసరం. దీంతో సౌత్ హీరోలలో సాలిడ్ గా ఉన్న హీరోలను నార్త్ వైపు అడుగులు పడేలా చేస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ తో ప్రభాస్ బాలీవుడ్ లోకి అడుగుపెట్టగా.. దేవ్ తో యష్ ను కూడా లాగాలని చూస్తున్నారట. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news