పీఫ్ ఖాతాదారులకు వచ్చే నెల నుండి డబ్బులు పడాలంటే ఇలా చెయ్యాల్సిందే..!

-

పీఫ్ ఖాతాదారులకు అలర్ట్. ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి. కనుక వాటిని తప్పక పాటించాలి. లేదు అంటే వచ్చే నెల నుండి డబులు పడవు అని గుర్తుపెట్టుకోండి. పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సంస్థ కీలక ప్రకటన చేయడం జరిగింది. కార్మిక మంత్రిత్వశాఖ సామాజిక భద్రత-2020 చట్టంలో సెక్షన్‌-142 ను ఈపీఎఫ్ఓ సవరించింది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

epf

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు ఈపీఎఫ్ఓ మార్పులు చేయడం జరిగింది. ఇప్పుడు తప్పక ప్రతీ ఒక్కరు సెప్టెంబర్ 1 లోగా ఆధార్ కార్డును ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలతో లింక్ చేసుకోవాలని చెప్పింది.

ఒకవేళ చెయ్యపోతే వచ్చే నెల డబ్బులు పడవు అని తెలియజేసింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వశాఖ సామాజిక భద్రత-2020 చట్టంలో సెక్షన్‌-142 ను ఈపీఎఫ్ఓ సవరించింది. కనుక డబ్బులు మరియు ఇతర లాభాలు కనుక ఉద్యోగులు పొందాలంటే ఆధార్‌ నంబర్‌ను లింక్‌ చెయ్యాల్సిందే. ఆధార్ లింక్ ఎలా చెయ్యాలి అనేది చూస్తే..

ఫస్ట్ ఈపీఎఫ్ఓ ​​వెబ్‌సైట్ www.epfindia.gov.in ఓపెన్ చెయ్యండి.
నెక్స్ట్ లాగిన్ అవ్వాలి.
ఇప్పుడు ఆన్‌లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేసి ఈ-కెవైసి పోర్టల్‌కు వెళ్ళండి.
ఇప్పుడు యుఎఎన్ ఆధార్ లింక్ పై క్లిక్ చేసి.. యుఎఎన్ నంబర్, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది.
ఇప్పుడు 12 అంకెల ఆధార్ నెంబర్ ని కూడా ఎంటర్ చేసి ఫారమ్‌ను సబ్మిట్ చెయ్యండి.
ఇప్పుడు ఓటీపీ ధృవీకరణ ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ వివరాలను ధృవీకరించడానికి మీ ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్, మెయిల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత లింక్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news