ఈపీఎఫ్ఓ వినియోగదారులకు కొత్త సేవలు… వివరాలు ఇవే..!

Join Our Community
follow manalokam on social media

ఈపీఎఫ్ఓ వినియోగదారులకు కొత్త సేవలు స్టార్ట్ చేసింది. దీనితో ఏమైనా సమస్యలు కానీ సందేహాలు కానీ ఉంటే వెంటనే పరిష్కారం అవుతుంది. ఇక ఈ కొత్త సేవల కోసం పూర్తి వివరాల లోకి వెళితే… వినియోగదారులకి ఏమైనా సమస్యలు వస్తే దానికి వీలుగా వాట్సప్ సేవల్ని ప్రారంభించింది. దీనితో బాగా బెనిఫిట్ ని పొందవచ్చు.

EPFO
EPFO

ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) ఎప్పటికప్పుడు వినియోగదారులకు ఎప్పటికప్పుడు సేవల్ని ఇస్తోంది. తాజాగా ఈ వాట్సప్ హెల్ప్‌లైన్ నెంబర్ ని ప్రారంభించింది. ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాట్సప్ సేవల్ని తీసుకు వచ్చారు. ఒక్కో సెంటర్‌కు ఒక్కే వాట్సప్ నెంబర్ కేటాయించింది.

వాట్సప్ సేవలే కాకుండా EPFIGMS, CPGRAMS పోర్టళ్లతో పాటు 24 గంటలు అందుబాటులో ఉండే కాల్ సెంటర్ కూడా వుంది. కావల్సిన సమాచారాన్ని నేరుగా వాట్స్ ఆప్ ద్వారా పొందవచ్చు. ఇలా దేశం లో ఉన్న మొత్తం 138 ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ వాట్సప్ సేవల్ని ప్రారంభించింది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల వాట్సప్ నెంబర్లు వివరాల లోకి వెళితే….హైదరాబాద్ ( బర్కత్ పుర ) 9100026170, హైదరాబాద్ ( మాదాపూర్) 9100026146
కరీంనగర్ 9492429685, కూకట్ పల్లి 9392369549, నిజామాబాదు 8919090653, పటాన్చెరు 9494182174, సిద్దిపేట 9603262989, వరంగల్ 8702447772, కడప 9491138297, రాజముండ్రి 9494633563, విశాఖపట్నం 7382396602.

 

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...