నవ్వులు చిందిస్తున్న ఈ పాప ప్రస్తుతం స్టార్ యాంకర్.. ఎవరో గుర్తుపట్టారా.. !

-

ఈ ఫోటోలో ఇంత క్యూట్ గా ఉండి చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా ప్రస్తుతం ఈమె బుల్లితెరపై తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్న స్టార్ యాంకర్.. మరి ఆమె ఎవరో ఒకసారి చూద్దాం..

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ను ప్రారంభించిన ఈ బుల్లితెర యాంకర్ తర్వాత కామెడీ షో లో మంచి పాపులర్ అయింది.. తర్వాత పలు షోలకు ఫాస్ట్ గా వ్యవహరిస్తూ కెరియర్లో దూసుకుపోయింది.. బుల్లితెరపై తన మాట‌లతో గ్లామ‌ర్‌తో అలరిస్తోన్న ఈ భామ.. ఎవరో గుర్తుపట్టగలరా.. తనే శ్రీ ముఖి.. ఇప్పటికే ఎన్నోసార్లు శ్రీముఖి చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం అందరిని ఆకర్షిస్తుంది..

శ్రీముఖి తన అందచందాలతో పదునైన మాటలతో కుర్ర కారును కట్టిపడేస్తుంది. టీవీ షోలు మూవీ ఈవెంట్స్‌లో అలరించిన ఈ భామ.. బిగ్ బాస్‌ సీజన్ 3లో పాల్గొని అభిమానులకు మరింత దగ్గరైంది. అలాగే నేను శైలజ వంటి చిత్రాల్లో కూడా నటించి మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకుంది అలాగే గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ట్రెండీ ఫోటో షూట్లతో మతి పోగోడుతుంది.. అలాగే మధ్యాహ్నం తన పెళ్లి విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేసింది శ్రీముఖి.. పెళ్లి ఇప్పట్లో కాదని తేల్చి చెప్పేసింది. అలాగే తాను ప్రస్తుతం రిలేషన్ లో లేను అంటూ చెప్పేసింది. ఇప్పుడు కెరీర్ పరంగా చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే తను మరో నాలుగు ఏళ్ల పాటు పెళ్లి కోసం ఆలోచించలేనని చెప్పేసింది అంతేకాకుండా తనను చేసుకోబోయేవాడు చాలా యాక్టివ్గా ఆనర్సిటిక్ గా ఉంటూ తనకు కావలసిన ఫ్రీ స్పేస్ ఇవ్వాలని చెప్పుకొచ్చింది శ్రీముఖి.

Read more RELATED
Recommended to you

Latest news