తప్పిపోయిన ఆ ఐదుగురు మా దగ్గరే ఉన్నారు.. చైనా ప్రకటన

-

గత కొన్ని రోజులుగా ఇండియా, చైనా ల మధ్య జరుగుతున్న సంఘటనల గురించి అందరికీ తెలిసిందే. చైనా అత్యుత్సాహం ప్రదర్శించి భారత్ భూభాగాలని తమదిగా చెప్పుకుంటూ వస్తోందన్న మాట వినిపిస్తుంది. ఈ విషయమై ఇండియా కూడా చైనాకి ధీటుగా సమాధానం ఇచ్చుకుంటూ వస్తుంది. ఐతే అదంతా పక్కన పెడితే తాజాగా ఒక జరిగిన ఉదంతం చర్చనీయాంశంగా మారింది. ఇండియా, చైనా సరిహద్దులో ఈ ఐదుగురు యువకులు తప్పిపోయారు.

ఐతే ఈ విషయమై భారత సైన్యం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సమాచారం పంపింది. ఆ ఐదుగురు యువకులు తమ దగ్గరే ఉన్నారంటూ చైనా ఆర్మీ ఒప్పుకుంది. నిజానికి ఆ యువకుల బృందం భారత సైనికులకి పోర్టర్లుగా, గైడ్ గా పనిచేస్తున్నారు. మొత్తం ఏడుగురు సభ్యుల బృందంలో నుండి ఇద్దరు యువకులు తప్పించుకుని ఇళ్ళు చేరుకోగా ఇంకా ఐదుగురు చైనా వద్ద ఉండిపోయారు. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని వారిని తిరిగి ఇండియా పంపమని భారత సైన్యం కోరగా అందుకు సరేనంటూ చైనా ఆర్మీ బదులిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జు ట్విట్టర్ వేదికగా తెలియజేసారు.

Read more RELATED
Recommended to you

Latest news