సహజంగా ఒకసారి కామెర్లు వచ్చాయి అంటే అంత త్వరగా నయంకావు… ఇవి నయం కావడానికి కొంచెం సమయం పడుతుంది. అందుకే కామెర్లు వచ్చినప్పుడు నయం చేయడానికి కొన్ని రసాలు ఉత్తమ నివారణగా పరిగణించబడుతున్నాయి. ఈ జ్యూస్ తయారు చేయడం చాలా సులభం అలాగే కామెర్లు ఉన్న రోగులకు ప్రతిరోజు దీనిని ఇవ్వడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. కామెర్లు అనేవి అత్యంత సాధారణ కాలేయ రుగ్మతలలో ఒకటి. దీనిలో కాలేయం యొక్క సరికాని కార్యకలాపాలు మన రక్త ప్రవాహంలో బిలీరూబిన్ పరిమాణంలో గణనీయమైన పెరుగుదలకు కారణం అవుతాయి దీనివల్ల చర్మం పసుపు రంగులోకి మారిపోతుంది.
కామెర్లో ఎక్కువగా చిన్న పిల్లలు నవజాత శిశువులలో రోగనిరోధక శక్తి లేని పెద్దవాళ్లలో కూడా సంభవిస్తాయి. కామెర్లవాది తగ్గాలంటే క్యారెట్ మరియు బీట్రూట్ ఎల్లప్పుడూ కూడా మన ఆరోగ్యంలో చేర్చుకోవాలి ఇది కామెర్లను తగ్గించడమే కాదు మన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి పచ్చకామర్లు వచ్చినవాళ్లు ప్రతిరోజూ క్యారెట్ అలాగే బీట్రూట్ తో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల కామర్ల సమస్య నుంచి బయటపడవచ్చు..
ఇక ముల్లంగి రసం కూడా పచ్చకామర్లను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. ముల్లంగి ఆకులను నీటిలో ఉడకబెట్టి తర్వాత శుభ్రమైన క్లాత్ ద్వారా వడకట్టాలి. ప్రతిరోజు మూడు గ్లాసుల ముల్లంగి రసం త్రాగుతూ ఉండడం వల్ల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. కామెర్లు త్వరగా తగ్గిపోవాలి అంటే చెరుకు రసం కూడా ఉత్తమమైన ఎంపిక. అందుకే ప్రతిరోజు రెండుసార్లు చెరుకు రసం తాగడం వల్ల కాలేయం పనితీరు బలపడి కామెర్లు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే కామర్లను తగ్గించడంలో నిమ్మరసం కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మీ మొత్తం ఆరోగ్య వ్యవస్థను శుభ్రపరచగలవు.