సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ డోస్ లేకుండా ఏ హీరోయిన్ కూడా స్టార్ స్టేటస్ సంపాదించుకోలేదు. ఒకప్పుడు నటనా పరంగా హీరోయిన్లకు మంచి క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఎవరుకాదన్నా గ్లామర్ షో లేకుండా హీరోయిన్ కు పెద్ద సినిమాల్లో ఆఫర్లు చాలా కష్టం. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం గ్లామర్ డోస్‌కు దూరంగా ఉంటూనే ఫ్యాన్స్ బేస్ సంపాదించుకుంటున్నారు.
కేవలం తమ నటన, ట్యాలెంట్‌తోనే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్నారు. ఎలాంటి బోల్డ్ సీన్స్ కూడా చేయట్లేదు. ఇంతకీ వాళ్లెవరంటే కీర్తి సురేశ్, సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్. ఈ ముగ్గురు బ్యూటీలది సెపరేట్ రూట్.
వీరు తాము ఎంచుకున్న ప్రతి సినిమాల్లో క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో వారికి ఆటోమేటిగ్‌గా ఫ్యాన్ బేస్ ఏర్పడుతోంది. క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ లేకున్నా.. బోల్డ్ సన్నివేశాలు ఉన్నా సున్నితంగానే ఆ సినిమాను తిరస్కరిస్తున్నారు. దీంతో వీళ్లు చాలా సినిమాలను కోల్పోతున్నారు. అయినా సరే తమ రూట్ మాత్రం చేంజ్ చేయట్లేదు. ఎంతైనా వీళ్ల నిర్ణయం చాలా మంచిదనే చెప్పాలి.