మహారాష్ట్ర నుండి వచ్చే వారికి కంపల్సరీ అంటున్న కర్ణాటక ప్రభుత్వం..

-

కరోనా మహమ్మారి చేసిన భీభత్సం అంతా ఇంతా కాదు. సంవత్సరం పాటుగా ప్రపంచాన్నే స్తంభింపజేసింది. ఇప్పుడిప్పుడే మెల్లగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఐతే కరోనా కారణంగా ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్ళడానికి అనేక నిబంధనలు అడ్డం వచ్చాయి. తాజాగా మహారాష్ట్ర నుండి వచ్చే వారికి కర్ణాటక ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర నుండి వచ్చే ఎవ్వరైనా కరోనా నెగెటివ్ అన్న రిపోర్ట్ ఉంటేనే రాష్ట్రంలోకి ప్రవేశం ఉంటుందని తెలిపింది.

విమానాల్లో, బస్సుల్లో, ప్రైవేటు వాహనాల్లో.. ఇలా ఏ విధంగా వచ్చినా ప్రతీ ఒక్కరికీ ఆర్ టీ పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ రిపోర్ట్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మహారాష్ట్రలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నట్టు కనిపించడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట. పర్యాటకం కోసం కర్ణాటక వెళ్ళేవారు ఇలాంటి ఆదేశాల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news