బ్యాంక్ లాకర్లని వాడే వారు వీటిని తెలుసుకోండి..!

-

చాలా మంది బంగారం మొదలైన వాటిని బ్యాంకు లాకర్ల లో పెట్టుకుంటారు. అయితే బ్యాంకు లాకర్లను వినియోగించే ఖాతాదారులు నియమాలను తప్పక పూర్తిగా తెలుసుకోవాలి అని ఆర్బీఐ అంది. ఎక్కువ రోజులు లాకర్‌ను తెరవని సందర్భంలో బ్యాంకులే స్వయంగా కస్టమర్ల లాకర్లను ఓపెన్ చేయవచ్చని ఆర్బీఐ చెబుతోంది. అయితే రూల్స్ ప్రకారం లాకర్ ని ఏడాదికి ఒకసారి అయినా ఓపెన్ చెయ్యాలి అని ఆర్బీఐ అంది. లేదంటే మీ బ్యాంకే లాకర్‌ను తెరవవచ్చు అని చెబుతోంది. ఇది ఇలా ఉంటే తక్కువ రిస్క్ కేటగిరీలో ఉన్న ఖాతాదారులకు బ్యాంకులు కాస్త సమయం ఇస్తాయి.

 

bank locker

కానీ మీడియం రిస్క్ విభాగంలో ఉన్నవారు మూడేళ్ల వరకు లాకర్‌ ఓపెన్ చేయకపోతే నోటిస్ ని పంపిస్తాయి. మాములుగా అయితే బ్యాంకులు తమ ఖాతాదారులను మొత్తం మూడు రిస్క్ కేటగిరీలుగా విభజిస్తాయి. అవి హై రిస్క్, మీడియం రిస్క్, లో రిస్క్. ఆ ప్రకారమే వారికి లాకర్లు కేటాయిస్తాయి. అయితే లాకర్‌ను ఎక్కువ కాలం తెరవకుండా ఉంచితే.. కస్టమర్లకు బ్యాంకు ఒక నోటీసు పంపుతుంది. లాకర్ సదుపాయాన్ని ఇవ్వాలా లేదా సరెండర్ చెయ్యాలా అని సూచిస్తుంది. ఒకవేళ కనుక ఎక్కువ రోజులు లాకర్‌ను ఆపరేట్ చేయకపోతే వివరాలను కస్టమర్లు బ్యాంకుకు రాతపూర్వకంగా తెలపాల్సి ఉంటుంది.

సరైన వివరణ ఇవ్వకపోతే లాకర్ సదుపాయాన్ని బ్యాంకు రద్దు చేస్తుంది. కస్టమర్లు లాకర్‌కు సంబంధించిన అన్ని ఫీజులు చెల్లించినా సరే, వాటిని నిర్ణీత సమయానికి ఓపెన్ చేయకపోతే రద్దు చేయవచ్చు. ఆ లాకర్‌ను వేరొకరికి కేటాయించవచ్చు. లాకర్ కేటాయించేటప్పుడు చేసుకున్న అగ్రిమెంట్‌లో ఇవన్నీ ఉంటాయి. ఒప్పందం చేసుకునే సమయంలోనే ఈ నిబంధన గురించి ప్రతి బ్యాంకు ఖాతాదారునికి సమాచారం అందించాల్సి ఉంటుంది. అప్పుడే లాకర్ కి అనుమతి ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news