బ్రేకింగ్ న్యూస్: పోలీసుల బస్సుపై ఉగ్రదాడి.. ముగ్గురు మృతి.. 14 మందికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పోలీస్ క్యాంప్ లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం శ్రీనగర్ శివారులోని జివన్ పోలీస్ క్యాంప్ దగ్గర పోలీస్ బస్సుపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జమ్ముకశ్మీర్‌కు చెందిన ముగ్గురు పోలీసులు మృతిచెందారు. 14 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం పోలీస్ బెటాలియన్ వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడ్డారు. ఈ సంఘటన సాయంత్రం పటాన్ చౌక్ ప్రాంతంలో చోటుచేసుకున్నది. వివరాలు తెలియాల్సి ఉన్నది.