ఏపీ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఫిట్ మెంట్ పై కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ఉద్యోగుల‌కు శుభ‌వార్త చెప్పింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ఫిట్ మెంట్ పై కాసేప‌టి క్రిత‌మే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర సీఎస్ స‌మీర్ శ‌ర్మ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఉద్యోగుల‌కు 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఉద్యోగుల‌కు 27 శాతం మాత్ర‌మే ఫిట్ మెంట్ ఇవ్వాల‌ని.. కార్యదర్శుల కమిటీ నివేదిక ఇచ్చింద‌ని సీఎస్ స‌మీర్ శ‌ర్మ ఈ సంద‌ర్భంగా వివ‌రించారు.

అయితే.. ఇవాళ తాను 30 శాతం ఫిట్ మెంట్ ఉద్యోగుల‌కు ఇవ్వాల‌నే నివేధిక‌ను ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఇచ్చార‌ని సీఎస్ స‌మీర్ శ‌ర్మ వెల్ల‌డించారు. ఫిట్ మెంట్ పై ఉద్యోగుల‌కు ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెంద‌న వ‌స‌రం లేద‌ని.. స‌మీర్ శ‌ర్మ భ‌రోసా క‌ల్పించారు. ఉద్యోగులు 40 శాతం పైగా ఫిట్ మెంట్ ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌గా…. కానీ ప్ర‌భుత్వం 30 శాతం ఇచ్చేందుకు రెడీ అయిన‌ట్లు.. సీఎస్ స‌మీర్ శ‌ర్మ వ్యాఖ్య‌లు చూస్తే అర్థ‌మౌవుతుంది.