తమిళ నాడు రాష్ట్రంలోని తిరునెల్వేలిలోని ఓ పురాతన పాఠశాలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మూత్ర శాల గోడ కూలిపోయి..ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. తిరునెల్వేలి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు సమీపంలోని స్కాప్టర్ ఉన్నత పాఠశాల అత్యంత పురాతనమైంది. శుక్రవారం ఉదయం.. పాఠశాలలోని మూత్ర శాల గోడ కూలిపోయింది.
అక్కడే ఉన్న ముగ్గురు 8వ తరగతి విద్యార్థులపై శిథిలాలు పడటం వల్ల తీవ్రంగా గాయపడి.. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరు విద్యార్థులను ఆస్పత్రి కి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. సంబంధిత అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. దర్యాప్తు చేపట్టారు. మరోవైపు.. 100 ఏళ్ల కు పైగా నడుస్తోన్న పాఠశాలలో భవనాలు, గోడలు శిథిలా వస్థకు చేరుకున్నాయని స్థానికులు ఆరోపించారు. ఇక ఈ సంఘటన పై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై.. ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆమె కోరారు. కాగా… ఇవాళ తమిళనాడులో తమిళ్ సై పర్యటించారు.