స్వాతంత్ర్య దినోత్సవం నాటి నుంచి జమ్ము కశ్మీర్‌లో ఉగ్రమూకలు మళ్లీ రెచ్చిపోయాయి. 48 గంటల్లో మూడు ఉగ్రదాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఓ హిందూ మైనారిటీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా దక్షిణ కశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని ఛోటేగావ్ ప్రాంతంలో ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇద్దరు సోదరులపై కాల్పులు జరిగాయి. ఒకరు మృతి చెందగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ క్రమంలో భారత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున బుద్గామ్‌లోని గోపాల్ పోరా ఛాడూరా వద్ద ఉగ్రవాదులు గ్రనేడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో కరణ్ సింగ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడా ఉందని వైద్యులు తెలిపారు. కాగా 48 గంటల్లో మూడు సార్లు ఉగ్రదాడికి పాల్పడటంతో భారత బలగాలు సీరియస్ అయ్యారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.