రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉత్తర కొరియా అధినేత కిమ్‌ల ప్రేమ లేఖలు

-

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, రష్యా అధినేత పుతిన్‌ల మధ్య ప్రేమ లేఖల రాయబారాలు సాగాయి. కొరియా విమోచన దినోత్సవం సందర్భంగా పుతిన్ కిమ్‌కు ఓ లేఖ రాశారు. ఉమ్మడి ప్రయత్నాలతో రష్యా, ఉత్తర కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించాలని పుతిన్‌ ఆకాంక్షించారు. ‘ఇరు దేశాల ప్రయోజనాలు కోరి సన్నిహిత సంబంధాలు కొనసాగిద్దాం. కొరియా ద్వీపకల్పం, ఈశాన్య ఆసియా ప్రాంత భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేయడంలో ఇవి సహాయపడతాయి’ అని పుతిన్‌ పేర్కొన్నారు.

ఈ లేఖకు స్పందించిన కిమ్‌.. రెండో ప్రపంచ యుద్ధంలో కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించిన జపాన్‌పై విజయంతో రష్యా- ఉత్తర కొరియా మధ్య స్నేహం ఏర్పడిందని గుర్తు చేశారు. అప్పటినుంచి ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం కొత్త శిఖరాలకు చేరుకుందన్నారు. శత్రు దేశాల బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలను ఉమ్మడిగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా ప్రకటించిన డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ స్వతంత్ర రాష్ట్రాలను ఉత్తర కొరియా గుర్తించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news