కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

-

జమ్ముకశ్మీర్‌ పూంచ్ జిల్లాలో భారీ ఎన్​కౌంటర్ జరిగింది. నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మృతుల్లో ఒక ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. మరో ఇద్దరి మృతదేహాలను పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని గ్రామస్థులు తీసుకెళ్లారని పేర్కొన్నారు.

మొదట ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరిపారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన అనంతరం రెండు ఏకే-47 రైఫిళ్లు, ఒక తుపాకీని అధికారులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

మరోవైపు, అనంత్​నాగ్​ జిల్లాలో ఓ ముష్కరుడు రెచ్చిపోయాడు. బోండియాల్​గామ్​లో ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులిద్దరినీ బిహార్​, నేపాల్​కు చెందిన వలసకూలీలుగా పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news