నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివాలయం పుష్కర ఘాట్ వద్ద ఈత కోసం వెళ్లి గల్లంతయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.
నల్గొండకు చెందిన నాగరాజు(39), వాచస్పతి (26), చంద్రకాంత్ (20) ముగ్గురు ఇవాళ నాగార్జునసాగర్ వద్దకు వెళ్లారు. అక్కడ పుష్కర్ ఘాట్ వద్ద స్నానాలు చేసేందుకు దిగారు. ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.