బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మరోసారి పాడైందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పాడవుతుందని ఎన్నిసార్లు చెప్పినా తిరిగి అదే బండి కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుంటే వాహనం ముందు చక్రం ఊడిపోయిందన్నారు. బండి వేగంగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తనకు ఇచ్చిన వాహనాన్ని మార్చాలని లేదంటే మీ వాహనం మీరు తీసుకోండి అంటూ పరుషపదజాలంతో వ్యాఖ్యానించారు.