కర్ణాటకలో ఎన్నికలు ముగిసిపోయిన నేపథ్యంలో ఇప్పుడు దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాల కన్ను అంతా ఈ ఫలితాల మీదనే ఉండనుంది. గతంలో ఏదో ఒక విధంగా అధికారాన్ని దక్కించుకున్న బీజేపీకి ఈ సారి ప్రజలు సరైన బుద్ది చెబుతారని కాంగ్రెస్ మద్దతుదారులు కామెంట్ చేశారు. కాగా ఇప్పుడు కర్ణాటకకు ఎగ్జిట్ పోల్స్ పై కొన్ని సర్వేలు బీజేపీ గెలుస్తుందని చెప్పగా, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ పోటా పోటీగా అయినా గెలుస్తుందని చెబుతున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన సీనియర్ నాయకుడు తులసి రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు (113) మ్యాజిక్ ఫిగర్ దాటి ఫలితాలు వస్తాయని ఆశాబావాన్ని వ్యక్తం చేశాడు.
మరి తులసి రెడ్డి చెప్పిందే నిజం అయితే కనుక కాంగ్రెస్ జేడీఎస్ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీజేపీ ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే గతంలో చేసినట్లుగా ఏమైనా ప్రయోగాలు చేసి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.