పేలు” ఈ మాట వింటే చాలు కొంత మందికి బీపీ హైలెవల్ లో లేస్తూ ఉంటుంది. రోజుల తరబడి నరకం అనుభవిస్తూ ఉంటారు కొందరు. తలలో చేతులు పెడితే చాలు, పేలు చీమల మాదిరి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఎన్ని మందులు వాడినా సరే వాటి నుంచి మాత్రం విముక్తి కనిపించదు. ముఖ్యంగా చిన్న పిల్లల కారణంగా ఇవి ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. స్కూల్ కి వెళ్లిన పిల్లలు పక్కన వారితో ఎక్కువగా తిరగడం, చనువుగా ఉండటంతో వారి తలలోని పేలు వీరి తలలోకి వస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
దీనితో పిల్లల తల్లులు కూడా ఈ ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా పొడవాటి జుట్టు ఉన్న వాళ్లకి ఈ సమస్య ఎక్కువ. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం పేల గురించి బయటకు వచ్చింది. స్మార్ట్ ఫోన్ కారణంగా తలలోకి పేలు ఎక్కువగా వస్తాయని అంటున్నారు. అది ఎలాగో చూద్దాం… తల్లో పేలు ఎగరలేవు, దూకలేవు. కొత్త వ్యక్తి జుట్టు తాకగానే.. ఆ వెంట్రుకలను పాకుతూ వారి తలలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యువత ఎక్కువగా సెల్ఫీలు దిగుతూ ఉంటుంది.
ఇక చిన్న పిల్లలు కనపడినా చాలు వారితో సెల్ఫీ దిగడానికి ఆసక్తి చూపించి దగ్గరగా తీసుకుని సెల్ఫీ దిగుతూ ఉంటారు. దీనితో వారి తలలో ఉన్న పేలు వీరి తలలోకి వస్తూ ఉంటాయట. అందుకే స్మార్ట్ ఫోన్ తో ఫోటో దిగేటప్పుడు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పేలు వచ్చాక వెంటనే తెలియదు. కొన్ని రోజుల తర్వాత అలర్జీ లాంటి లక్షణాలు కనిపించి అప్పుడు పేలు ఉన్న విషయం బయటపడుతుంది. తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం బయటపడింది. ఇకపోతే… జంతువుల తలలో పేలు ఉండవట… మనిషి తలే వాటికి ఇస్తామని చెప్తున్నారు పరిశోధకులు.