అప్పటివరకు అస్సాం ముస్లిం మెజారిటీగా మారుతుంది:సీఎం హిమంత బిశ్వ సర్మ

-

అస్సాం రాష్ట్రంలో పెరుగుతున్న ముస్లిం జనాభాపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ ఆందోళన వ్యక్తం చేశారు. 2041 నాటికి రాష్ట్రం ముస్లిం మెజారిటీగా మారుతుందని, ఇది పచ్చినిజమని శుక్రవారం ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ముస్లిం జనాభా ప్రతీ 10 సంవత్సరాలకు 30 శాతం పెరుగుతోందని, 2041 నాటికి వారే మెజారిటీ అవుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గౌహతిలో జరిగిన విలేకరులు సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాం జనాభాలో ముస్లింలు 40 శాతంగా ఉన్నారని, దీనిని ఎవరూ ఆపలేరని తెలిపారు. బుధవారం రోజు కూడా ఆయన రాష్ట్రంలో ముస్లిం జనాభా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలా ముస్లిం జనాభా విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని, ముస్లిం జనాభా అనేది రాజకీయ విషయం కాదని, ఇది ‘జీవన్మరణ’ సమస్య అంటూ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జనాభా వైవిధ్యం మారడం నాకు పెద్ద సమస్య అని,1951లో 12 శాతం ఉన్న ముస్లింలు ఇప్పుడు 40 శాతానికి చేరుకున్నారని, దీని వల్ల తాము చాలా జిల్లాలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news