లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు – అవినాశ్ రెడ్డి సీరియస్

-

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతిలో దాడికి గురైన వారిని పరామర్శిస్తున్నామని… సింహాద్రిపురం మండలం లో దాడికి గురైన అబ్బాస్,ప్రతాప్ రెడ్డి వల్లిలను పరామర్శించి మనోధైర్యం ఇచ్చామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నెల రోజుల్లోనే వేల మంది వైకాపా కార్యకర్తలపై దాడులకు పాల్పడ్ఢారు…. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

నిన్న గుంటూరులో వేల మంది చూస్తుండగా వైకాపా కార్యకర్త రషీద్ పాశవికంగా దాడి చేసి హత్య చేశారని… వేంపల్లె లో అజయ్ రెడ్డి పై హాకీ స్టిక్ లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కేవలం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు….సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాం అంటున్నారని ఆగ్రహించారు. గత ఐదేళ్లలో మేము అలా అనుకొని ఉంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండేవారు కాదని… మా నాయకుడు అలాంటివి ప్రోత్సాహించలేదని వివరించారు. పార్టీలు ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాలనే మా నాయకుడు ఆలోచించారు…తెలుగుదేశం పార్టీ ఏర్పడిన వెంటనే పులివెందుల ఇసుక డిపోలో నిల్వ ఉన్న 60 వేల టన్నుల ఇసుక మాయం అయిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news